బోటును బయటకు తీయలేం " కిషన్ రెడ్డి
గోదావరిలో ఇటీవల ప్రమాదానికి గురైన బోటును బయటకు తీసేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బురద, ఇసుకలో బోటు కూరుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిలో కొందరు అందులో ఉండవచ్చన్నారు. ప్రస్తుతం బోటు వెలికితీసే అవకాశం లేదని… వరద తగ్గిన తర్వాతే దాన్ని బయటకు తీస్తామని చెప్పారు. కేంద్రం నుంచి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజమండ్రి […]

గోదావరిలో ఇటీవల ప్రమాదానికి గురైన బోటును బయటకు తీసేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బురద, ఇసుకలో బోటు కూరుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
చనిపోయిన వారిలో కొందరు అందులో ఉండవచ్చన్నారు. ప్రస్తుతం బోటు వెలికితీసే అవకాశం లేదని… వరద తగ్గిన తర్వాతే దాన్ని బయటకు తీస్తామని చెప్పారు.
కేంద్రం నుంచి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాజమండ్రి వచ్చిన కిషన్ రెడ్డి… బోటు అన్వేషణ ఆపరేషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.