Telugu Global
NEWS

నిరుద్యోగులపై లెక్కలేస్తున్న చంద్రబాబు

20 లక్షల మందికి ఓకేసారి పరీక్ష నిర్వహించి లక్షా 34వేల ఉద్యోగాలు కల్పించడం అన్నది రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. ఆ ఘనతను జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం దక్కించుకుంది. పరీక్ష విధానంలో ప్రతి చోట అధికారులు చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ రావడంతో నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు వచ్చినా సరే తన మన అన్న భేదం లేకుండా పరీక్షలను నిర్వహించింది జగన్ ప్రభుత్వం. పరీక్ష విధానంలో ఎక్కడ చిన్న లోటు జరిగినా […]

నిరుద్యోగులపై లెక్కలేస్తున్న చంద్రబాబు
X

20 లక్షల మందికి ఓకేసారి పరీక్ష నిర్వహించి లక్షా 34వేల ఉద్యోగాలు కల్పించడం అన్నది రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. ఆ ఘనతను జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం దక్కించుకుంది. పరీక్ష విధానంలో ప్రతి చోట అధికారులు చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ రావడంతో నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు వచ్చినా సరే తన మన అన్న భేదం లేకుండా పరీక్షలను నిర్వహించింది జగన్ ప్రభుత్వం.

పరీక్ష విధానంలో ఎక్కడ చిన్న లోటు జరిగినా వెంటనే బ్యానర్ ఐటమ్స్‌గా రాసి రచ్చ చేసేందుకు టీడీపీ పత్రికలు ఎదురుచూశాయి. కానీ ఆ అవకాశం రాలేదు. దాంతో టీడీపీ పత్రిక చివరకు తెగించి ఫలితాలు వచ్చిన తర్వాత పేపర్ లీక్ అంటూ రచ్చ మొదలుపెట్టింది. ఫలాన వాళ్లకు ర్యాంకు వచ్చింది కాబట్టి పేపర్ లీక్ అయినట్టే అంటూ నిరాధారంగా పుకార్ల తరహా వార్తలు రాసింది.

ఆ వెంటనే చంద్రబాబు అందుకున్నారు. తమ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. ఏకంగా జగన్‌ రాజీనామా చేయాలి అంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే టీడీపీ పత్రిక కథనం రాయడం, దాన్ని పట్టుకుని బాబు గగ్గోలు పెట్టడం వెనుక అచ్చమైన ఓట్ల లెక్కలే ఉన్నాయి.

ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు నిర్వహించిన వేళ మౌనంగా ఉంటే జగన్‌కు భారీ క్రెడిట్ దక్కుతుంది. ఇప్పుడు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు కూడా ఈ ప్రభుత్వంలో పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయి కాబట్టి ధైర్యంగా రాబోయే కాలంలో ఉద్యోగాలు సాధించవచ్చన్న భావనకు వస్తారు. అది కూడా జగన్‌కు మంచి చేసేది. కానీ జగన్‌కు అలా మంచి పేరు రాకూడదనే చంద్రబాబు, ఆయన పత్రిక ఎత్తు వేశాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ఏ పరీక్షలోనైనా అర్హత సాధించే వారి కంటే విఫలమయ్యే అభ్యర్థులే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు పేపర్ లీక్ అయింది అని ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగం సాధించలేకపోయిన వారందరిలోనూ విషబీజాలు నాటవచ్చు అన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది.

ఉద్యోగాలు సాధించిన లక్షా 34 వేల మంది జగన్‌కు జై కొట్టినా… ఉద్యోగాలు రాని 18 లక్షల మంది నిరుద్యోగుల మెదళ్లలో లేనిపోని విషయాన్ని ఎక్కించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిలో వ్యతిరేక భావన కలిగించాలన్నది చంద్రబాబు క్షుద్ర ఆలోచన అని స్పష్టంగా తెలుస్తోంది.

అందుకే పరీక్షలు జరుగుతున్నంత సేపు ఎక్కడా విమర్శలు చేయని టీడీపీ మీడియా… తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత విషం చిమ్మడం వెనుక అసలు ఉద్దేశం కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడమే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

First Published:  23 Sept 2019 4:29 AM IST
Next Story