భారత క్రికెటర్లకు భారీగా పెరిగిన దినసరి భత్యం
స్వదేశీ సిరీస్ ల్లో 7500 రూపాయలు, విదేశీ టూర్లలో 250 డాలర్లు విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత క్రికెటర్లు ఇక నుంచి వెయ్యి శాతం దినసరి భత్యం అందుకోనున్నారు. ఇప్పటికే స్వదేశీ,విదేశీ సిరీస్ లతో పాటు…ఐపీఎల్ కాంట్రాక్టులతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న భారత ఆటగాళ్లకు స్వదేశీ, విదేశీ సిరీస్ ల్లో పాల్గొనే సమయంలో ఇచ్చే డైలీ అలవేన్స్ లను పెంచుతూ .. వినోద్ రాయ్ నేతృత్వంలోని భారత క్రికెట్ మండలి ఆదేశాలు జారీ చేసింది. విదేశీ టూర్లలో రోజుకు 250 […]
- స్వదేశీ సిరీస్ ల్లో 7500 రూపాయలు, విదేశీ టూర్లలో 250 డాలర్లు
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత క్రికెటర్లు ఇక నుంచి వెయ్యి శాతం దినసరి భత్యం అందుకోనున్నారు. ఇప్పటికే స్వదేశీ,విదేశీ సిరీస్ లతో పాటు…ఐపీఎల్ కాంట్రాక్టులతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న భారత ఆటగాళ్లకు స్వదేశీ, విదేశీ సిరీస్ ల్లో పాల్గొనే సమయంలో ఇచ్చే డైలీ అలవేన్స్ లను పెంచుతూ .. వినోద్ రాయ్ నేతృత్వంలోని భారత క్రికెట్ మండలి ఆదేశాలు జారీ చేసింది.
విదేశీ టూర్లలో రోజుకు 250 డాలర్లు…
విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలో భారతజట్టు సభ్యులకు ఇంతకు ముందు వరకూ రోజుకు 125 డాలర్లు దినసరిభత్యంగా చెల్లించేవారు. ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
స్వదేశంలో సిరీస్ లు ఆడే సమయంలో…రోజుకు 7వేల 500 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు. డాలర్ తో రూపాయి మారకం హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా.. 7500 రూపాయలుగా భత్యాన్ని ఖరారు చేశారు.
భారత క్రికెటర్లకు మాత్రమే కాదు…శిక్షణ, సహాయక సిబ్బందికి సైతం ఇదే మొత్తాన్ని భత్యంగా ఇవ్వనున్నారు.
బోర్డు సభ్యులకు రోజుకు 750 డాలర్లు…
భారత క్రికెట్ పాలకమండలి సభ్యులు, బీసీసీఐ కార్యవర్గ సభ్యులు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో రోజుకు 750 డాలర్లు చొప్పున దినసరి భత్యం చెల్లించనున్నారు.
బీసీసీఐ గ్రేడింగ్ ప్రకారం 7 కోట్ల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ వార్షిక కాంట్రాక్టులు అందుకొంటున్న క్రికెటర్లు… ఆడిన ఒక్కో టెస్టుకు 15 లక్షలు, ఒక్కో వన్డేకు 6 లక్షల రూపాయలు, టీ-20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజుగా అందుకొంటున్నారు.
అంతేకాదు…క్రికెటర్లందరికీ బిజినెస్ క్లాస్ ట్రావెల్, వసతి, లాండ్రీ ఖర్చులు భరిస్తూ వస్తున్న బీసీసీఐ…దినసరి భత్యాన్ని సైతం చెల్లించడం విశేషం.