వరల్డ్ ఫేమస్ రెబల్
వరల్డ్ ఫేమస్ లవర్ పేరుతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు హీరోయిన్లు. పైగా టైటిల్ లోనే లవర్ అనే పదం ఉంది కాబట్టి ఇదొక ఫక్తు ప్రేమకథ అని అంతా భావిస్తూ వస్తున్నారు. దీంతో ఫస్ట్ లుక్ కూడా సాఫ్ట్ గా ఉంటుందని భావించారు. విజయ్ దేవరకొండను లవర్ బాయ్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఏదో జరుగుతుందని కూడా అనుకున్నారు. కానీ అందరికీ షాక్. కొద్దిసేపటి కిందట విడుదలైన […]

వరల్డ్ ఫేమస్ లవర్ పేరుతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు హీరోయిన్లు. పైగా టైటిల్ లోనే లవర్ అనే పదం ఉంది కాబట్టి ఇదొక ఫక్తు ప్రేమకథ అని అంతా భావిస్తూ వస్తున్నారు. దీంతో ఫస్ట్ లుక్ కూడా సాఫ్ట్ గా ఉంటుందని భావించారు. విజయ్ దేవరకొండను లవర్ బాయ్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఏదో జరుగుతుందని కూడా అనుకున్నారు. కానీ అందరికీ షాక్.
కొద్దిసేపటి కిందట విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ చూస్తే ఎవరికైనా మరోసారి అర్జున్ రెడ్డి గుర్తురాకమానడు. అవును.. ఎగ్రెసివ్ లుక్స్ తో, రఫ్ గడ్డంతో, ముఖంపై రక్తపు మరకలతో, చేతిలో సిగరెట్ తో మరోసారి రెబల్ అవతారం చూపించాడు విజయ్ దేవరకొండ. లవర్ గెటప్ వస్తుందనుకుంటే ఇలా రెబల్ గెటప్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు యూనిట్.
అర్జున్ రెడ్డి టైపులో కేవలం ఇంగ్లిష్ లోనే ఈ సినిమా టైటిల్ కూడా ఉంటుందని అంతా భావించారు. కానీ మేకర్స్ మాత్రం తెలుగు టైటిల్ తో కూడా పోస్టర్ రిలీజ్ చేసి అనుమానాలు నివృత్తి చేశారు. అయితే ఫస్ట్ లుక్ ను కేవలం అక్కడివరకే పరిమితం చేశారు. రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ ఎప్పుడు లాంటి అంశాల జోలికి వెళ్లలేదు.
రాశిఖన్నా, ఐశ్వర్యరాజేశ్, క్యాథరీన్, ఇసబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను క్రాంతిమాధవ్ డైరక్ట్ చేస్తున్నాడు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇదొక్కటే.
First Look.#WorldFamousLover#WFLFirstLook pic.twitter.com/41li0tdkzE
— Vijay Deverakonda (@TheDeverakonda) September 20, 2019