విక్రమ్ ల్యాండర్ చరిత్ర ముగిసినట్టే...
చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ కాలం ముగిసినట్టే. చంద్రుడిపై పగలు ముగిసి రాత్రి వచ్చేసింది. దీంతో ఇక విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు సమాప్తం అయ్యాయి. ఈనెల 7న చంద్రుడిని విక్రమ్ ఢీ కొట్టింది. సాప్ట్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. దాంతో విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే పగలు శనివారంతో ముగిసింది. రాత్రి మొదలైంది. 14 రోజుల పాటు రాత్రి ఉంటుంది. […]
చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ కాలం ముగిసినట్టే. చంద్రుడిపై పగలు ముగిసి రాత్రి వచ్చేసింది. దీంతో ఇక విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు సమాప్తం అయ్యాయి. ఈనెల 7న చంద్రుడిని విక్రమ్ ఢీ కొట్టింది. సాప్ట్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. దాంతో విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి.
చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే పగలు శనివారంతో ముగిసింది. రాత్రి మొదలైంది. 14 రోజుల పాటు రాత్రి ఉంటుంది. చంద్రుడిపై రాత్రి సమయంలో మైనస్ 200 డిగ్రీల వరకు చలి ఉంటుంది. దాన్ని తట్టుకునే వ్యవస్థ విక్రమ్ ల్యాండర్‌లో లేదు. దాంతో మైనస్ 200 డిగ్రీల చలి కారణంగా విక్రమ్ శాశ్వతంగా పాడైపోతుంది. 14 రోజుల రాత్రి ముగిసి తిరిగి పగలు వచ్చిన తర్వాత చంద్రయాన్-2 ఆర్బిటర్ ద్వారా విక్రమ్ కోసం అన్వేషణ అయితే కొనసాగించనున్నారు.