టీ-20 ఫార్మాట్లో చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ
కొహ్లీ తర్వాతి స్థానాలలో రోహిత్, ధావన్ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కొహ్లీ సగటు 50 భారత ఆల్ -ఇన్- వన్ కెప్టెన్ విరాట్ కొహ్లీ..ఫార్మాట్ ఏదైనా తన ప్రత్యేకతను చాటుకొంటూ దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం కొహ్లీ తన బ్యాటుకు పూర్తి స్థాయిలో పని చెప్పాడు. మొహాలీ వేదికగా ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో 72 పరుగుల నాటౌట్ స్కోరుతో తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించడమే కాదు…ప్లేయర్ ఆఫ్ […]
- కొహ్లీ తర్వాతి స్థానాలలో రోహిత్, ధావన్
- క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కొహ్లీ సగటు 50
భారత ఆల్ -ఇన్- వన్ కెప్టెన్ విరాట్ కొహ్లీ..ఫార్మాట్ ఏదైనా తన ప్రత్యేకతను చాటుకొంటూ దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం కొహ్లీ తన బ్యాటుకు పూర్తి స్థాయిలో పని చెప్పాడు.
మొహాలీ వేదికగా ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో 72 పరుగుల నాటౌట్ స్కోరుతో తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించడమే కాదు…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు.
చేజింగ్ సమయంలో అత్యుత్తమ సగటుతో విరాట్ కొహ్లీ తనకుతానే సాటిగా నిలిచాడు. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో సైతం తాను చేజింగ్ కింగ్ నేనని చాటుకొన్నాడు.
చేజింగ్ లో కొహ్లీ సగటు 111.5
టీ-20 క్రికెట్లో సైతం తనజట్టు చేజింగ్ కు దిగిన సమయంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ కళ్లు చెదిరే సగటు నమోదు చేశాడు. చేజింగ్ కు దిగిన 25 మ్యాచ్ ల్లో 23 ఇన్నింగ్స్ ఆడిన కొహ్లీ 82 పరుగుల అత్యధిక స్కోరుతో 1115 పరుగులు సాధించాడు.
ఇందులో 22 సిక్సర్లు, 12 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. 131. 48 స్ట్ర్రయిక్ రేట్ సైతం కొహ్లీకి మాత్రమే సొంతం.
కొహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్..
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…చేజింగ్ కు దిగిన సమయంలో అత్యుత్తమ సగటు సాధించిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేజింగ్ కు దిగిన 34 మ్యాచ్ ల్లో 31 ఇన్నింగ్స్ ఆడి ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో 764 పరుగులు సాధించాడు. ఇందులో33 సిక్సర్లతో పాటు..123. 82 స్ట్ర్రయిక్ రేట్ సైతం ఉంది.
మూడోస్థానంలో శిఖర్ ధావన్
భారతజట్టు చేజింగ్ కు దిగిన సమయంలో 24 మ్యాచ్ లు ఆడిన శిఖర్ ధావన్ మూడు హాఫ్ సెంచరీలతో 538 పరుగులు సాధించాడు. ఇందులో 12 సిక్సర్లతో పాటు.. 92 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సైతం ఉంది. 12 సిక్సర్లు, 3 హాఫ్ సెంచరీలతో 119.55 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు.
చేజింగ్ సమయంలో కొహ్లీ సగటు 111 కాగా…రోహిత్ శర్మ 28.29, శిఖర్ ధావన్ 25.61 సగటుతో నిలవడం విశేషం.