సినిమా టికెట్ యాప్స్ కు టీ సర్కార్ భారీ షాక్
సినిమా టికెట్లను ఆన్‌లైన్లో విక్రయించే యాప్ లకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్ నిర్వహించిన తలసాని చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా స్పందించారు. ఇకపై ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఆన్‌లైన్ యాప్స్ రకరకాల ట్యాక్స్‌లను టికెట్లపై రుద్దుతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. బుక్ మై షో, పేటీఎం, ఈజీ […]
సినిమా టికెట్లను ఆన్‌లైన్లో విక్రయించే యాప్ లకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్ నిర్వహించిన తలసాని చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా స్పందించారు.
ఇకపై ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఆన్‌లైన్ యాప్స్ రకరకాల ట్యాక్స్‌లను టికెట్లపై రుద్దుతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. బుక్ మై షో, పేటీఎం, ఈజీ మూవీస్ పేరుతో పలు యాప్స్ టికెట్లు అమ్ముతూ అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఈ దోపిడి నుంచి కాపాడేందుకు ప్రభుత్వమే ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ ద్వారా టికెట్లు అమ్మేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
రేస్ కోర్స్ ట్యాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామని దాంతో గతంలో లక్షల్లో ఉండే పన్ను వసూలు ఇప్పుడు కోట్లలోకి చేరిందని తలసాని చెప్పారు. చిత్రపరిశ్రమలో కుటుంబ బలం లేకుండా టాలెంట్ ఉన్నోడే అసలైన హీరో అని తలసాని వ్యాఖ్యానించారు.