కామెడీ, యాక్షన్ తో ఆకట్టుకుంటున్న... '90 ఎం ఎల్' టీజర్
హీరో కార్తికేయ గుమ్మ కొండ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్నాడు. కానీ ఈ మధ్య విడుదలైన ‘హిప్పీ’ తో మాత్రం అంతగా మెప్పించలేకపోయాడు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా కనిపించిన కార్తికేయ… ఇప్పుడు మళ్లీ ఒక కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి ’90 ఎమ్ ఎల్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. తాజాగా చిత్ర టీజర్ ని […]
హీరో కార్తికేయ గుమ్మ కొండ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్నాడు. కానీ ఈ మధ్య విడుదలైన ‘హిప్పీ’ తో మాత్రం అంతగా మెప్పించలేకపోయాడు.
తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా కనిపించిన కార్తికేయ… ఇప్పుడు మళ్లీ ఒక కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి ’90 ఎమ్ ఎల్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు.
తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. టైటిల్ లాగానే సినిమాలో కూడా కార్తికేయ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
కార్తీకేయ ఈ సినిమాలో ఒక తాగుబోతు పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్ లో ఒక వైపు కామెడీతో నవ్విస్తూనే మరో వైపు విలన్ లని చితకబాదుతూ కనిపిస్తాడు కార్తికేయ. ఆఖర్లో అలి రోజుకి ఎంత తాగుతావు అని అడుగగా, డాక్టర్ 90 ఎం ఎల్ మాత్రమే తాగమన్నారు అని కార్తికేయ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Here's our Authorized Drinker ?@ActorKartikeya's #90MLTeaser ► https://t.co/yNNc6MyZym#HBDKartikeya@kartikeyas90ml@Shekhar_Dreamz @anuprubens #JYuvraj @SrSekkhar @AshokGummakonda @kcwoffl
— Kartikeya Creative Works (@kcwoffl) September 21, 2019