హరీష్ శంకర్ బాలీవుడ్ డ్రీమ్స్
గద్దలకొండ గణేశ్ ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్.. తన బాలీవుడ్ డ్రీమ్ గురించి బయటపెట్టాడు. ఎప్పటికైనా ఓ హిందీ సినిమా డైరక్ట్ చేస్తానని, ఆ కల నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి ఈ దర్శకుడికి. హిందీ అవకాశం వస్తే సరిపోదు, హీరో ఎవరనేది కూడా ఇతడే డిసైడ్ చేస్తున్నాడు. “బాలీవుడ్ సినిమా తప్పకుండా చేస్తా. నాక్కూడా బాలీవుడ్ కు వెళ్లాలని ఉంది. కాకపోతే […]
గద్దలకొండ గణేశ్ ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్.. తన బాలీవుడ్ డ్రీమ్ గురించి బయటపెట్టాడు. ఎప్పటికైనా ఓ హిందీ సినిమా డైరక్ట్ చేస్తానని, ఆ కల నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.
అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి ఈ దర్శకుడికి. హిందీ అవకాశం వస్తే సరిపోదు, హీరో ఎవరనేది కూడా ఇతడే డిసైడ్ చేస్తున్నాడు.
“బాలీవుడ్ సినిమా తప్పకుండా చేస్తా. నాక్కూడా బాలీవుడ్ కు వెళ్లాలని ఉంది. కాకపోతే షారూక్ ఖాన్ తో సినిమా చేయాలనేది నా డ్రీమ్. మంచి ఛాన్స్ వస్తే, మంచి కథ దొరికితే షారూక్ ఖాన్ ను డైరక్ట్ చేస్తాను. అయితే షారూక్ ను డైరక్ట్ చేయాలనేది నా డ్రీమ్ మాత్రమే. ఈలోగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను.”
ఇలా తన బాలీవుడ్ డ్రీమ్స్ ను బయటపెట్టాడు హరీష్ శంకర్. బాలీవుడ్ కు కూడా రీమేక్ సబ్జెక్ట్ తో వెళ్తారా… అనే ప్రశ్నకు తప్పేముందని రివర్స్ లో ప్రశ్నిస్తున్నాడు హరీష్. మంచి కథ ఓ భాషలో హిట్ అయినప్పుడు, అదే కథను బాలీవుడ్ కు కూడా తీసుకెళ్లడంతో తప్పులేదంటున్నాడు. తను తీసిన డీజే సినిమాకు బాలీవుడ్ లో రీమేక్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, పైగా కేవలం స్టార్ హీరోలు మాత్రమే చేయాల్సిన సబ్జెక్ట్ అదని అంటున్నాడు హరీష్.