Telugu Global
Health & Life Style

బట్టతలకు 'టోపీ' చికిత్స

ఎలక్ట్రిక్ ప్యాచ్ ని అమర్చి వెంట్రుకలు లేని ఎలుకలకు వెంట్రుకలు పెరిగేలా చేశారు శాస్త్రవేత్తలు. ఈ పాచ్ ని ఓటోపీ (క్యాప్) లోపల అమర్చి ధరిస్తే పురుషులలో బట్టతల రివర్స్ కావచ్చని వారు అంటున్నారు. అంటే ఇక బట్టతల సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టేనన్న మాట. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలోని జుడాంగ్ వాంగ్, అతని సహచరులు వైర్‌లెస్ ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు. ఇవి నెత్తిమీద అంటుకుని, యాదృచ్ఛిక శరీర కదలికల నుండి శక్తిని ఉపయోగించడం ద్వారా విద్యుత్ పల్స్ […]

బట్టతలకు టోపీ చికిత్స
X

ఎలక్ట్రిక్ ప్యాచ్ ని అమర్చి వెంట్రుకలు లేని ఎలుకలకు వెంట్రుకలు పెరిగేలా చేశారు శాస్త్రవేత్తలు. ఈ పాచ్ ని ఓటోపీ (క్యాప్) లోపల అమర్చి ధరిస్తే పురుషులలో బట్టతల రివర్స్ కావచ్చని వారు అంటున్నారు. అంటే ఇక బట్టతల సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టేనన్న మాట.

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలోని జుడాంగ్ వాంగ్, అతని సహచరులు వైర్‌లెస్ ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు. ఇవి నెత్తిమీద అంటుకుని, యాదృచ్ఛిక శరీర కదలికల నుండి శక్తిని ఉపయోగించడం ద్వారా విద్యుత్ పల్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ పల్స్ బట్టతల ప్రాంతం లో ఉన్న కణాలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితం గా మళ్లీ జుట్టు మొలకెత్తుతుంది.

వాంగ్ బృందం జన్యు లోపం కారణంగా వెంట్రుకలు లేని ఎలుకలపై ఈ ప్యాచ్‌ను పరీక్షించింది. తొమ్మిది రోజుల తరువాత, 2 మిల్లీమీటర్ల పొడవైన వెంట్రుకలు పాచ్ కింద వాటి చర్మంపై పెరగడం వారు గమనించారు.

వాంగ్ కొన్నేళ్లుగా బట్టతలగా మారుతున్న తన తండ్రి తలపై పాచ్‌ను ఉంచి పరీక్షించాడు. “ఇది ఒక నెల తరువాత చాలా కొత్త వెంట్రుకలు పెరగడానికి సహాయపడింది” అని ఆయన చెప్పారు.

అతని బృందం ఇప్పుడు జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచేందుకు బేస్ బాల్ టోపీని రూపొందించింది. క్లినికల్ ట్రయల్లో దీనిని పరీక్షించడానికి అనుమతి కోరుతోంది.

ప్రస్తుతం జుట్టు కోల్పోతున్న లేదా ఇటీవల బట్టతలగా మారిన మగవాళ్లకు మాత్రమే టోపీ పని చేస్తుందట. చాలా సంవత్సరాలు బట్టతలగా ఉంటే చర్మం కొత్త హెయిర్ ఫోలికల్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాబట్టి మరీ సీనియర్ బట్టతలలకు ఈ టోపీ చికిత్స పనిచేయదని వాంగ్ చెప్పారు.

First Published:  21 Sept 2019 7:30 AM IST
Next Story