Telugu Global
NEWS

పోలవరం 40 శాతమే పూర్తయింది.... 32 వేల కోట్లతో ఆర్‌ అండ్ ఆర్‌ పూర్తి చేయాలి....

పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ విమర్శించారు. పోలవరం నిర్మాణం ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. ఆ 40 శాతంలోనూ పోలవరం కుడి, ఎడమ కాలువ నిర్మాణం వైఎస్‌ హయాంలోనే పూర్తయిందన్నారు. పోలవరం పునరావాసం కింద లక్షా 6వేల ఇళ్లు నిర్మించాల్సి ఉందని… కానీ చంద్రబాబు వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వం తొలుత ముంపుకు […]

పోలవరం 40 శాతమే పూర్తయింది.... 32 వేల కోట్లతో ఆర్‌ అండ్ ఆర్‌ పూర్తి చేయాలి....
X

పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ విమర్శించారు. పోలవరం నిర్మాణం ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. ఆ 40 శాతంలోనూ పోలవరం కుడి, ఎడమ కాలువ నిర్మాణం వైఎస్‌ హయాంలోనే పూర్తయిందన్నారు.

పోలవరం పునరావాసం కింద లక్షా 6వేల ఇళ్లు నిర్మించాల్సి ఉందని… కానీ చంద్రబాబు వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వం తొలుత ముంపుకు గురయ్యే ప్రాంతం వారికి ఈ ఏడాదే 25వేల ఇళ్ళు కట్టించాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే చంద్రబాబుకు ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. ఈ పక్రియ వల్ల డబ్బులు ఆదా అవుతాయే గానీ వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. రివర్స్ టెండరింగ్‌లో కావాలంటే నవయుగ కంపెనీ కూడా పాల్గొనాలని మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ పిలుపునిచ్చారు. పోలవరం 65వ ప్యాకేజీలో 290 కోట్ల విలువైన పనికి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తేనే ప్రభుత్వానికి 58 కోట్లు మిగిలిందన్నారు.

చంద్రబాబు హయాంలో ఎక్కువ ధరకు పని దక్కించుకున్న అదే మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ ఇప్పుడు 15.6 శాతం తక్కువకే పనులు చేసేందుకు ముందుకొచ్చిందంటే దీన్ని బట్టే చంద్రబాబు హయాంలో దోపిడి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు.

భారీ వరద కారణంగా నవంబర్‌ వరకు పనులు చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా పోలవరం నిర్మాణాన్ని ఆపేశారంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని అనిల్ విమర్శించారు.

వయసు మీద పడ్డ తర్వాత కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోలేకపోతున్నారని మండిపడ్డారు. చివరకు లక్షకు పైగా ఉద్యోగాలు ఇస్తుంటే దానిపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గోదావరి వరద వస్తే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదు అని శాపనార్థాలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భూమిలో కూడా నీళ్లు లేకుండాపోయాయని… జగన్‌ ప్రభుత్వం ధర్మంగా పాలిస్తోంది కాబట్టే ప్రకృతి కూడా సహకరిస్తోందని… అన్ని ప్రాంతాలు వర్షాలు కురిసి పచ్చగా ఉన్నాయన్నారు.

నదీ గర్భంలో నిర్మించిన లింగమనేని భవనం కూల్చివేతకు సీఆర్‌డీఏ నోటీసులు ఇస్తే… అద్దెకు ఉంటున్న చంద్రబాబు ఎందుకు అంతగా ఉలికిపాటుకు గురి అవుతున్నాడని అనిల్ కుమార్ ప్రశ్నించారు.

First Published:  21 Sept 2019 6:47 AM IST
Next Story