Telugu Global
NEWS

రేవంత్ స్పీడ్ తగ్గించుకో.... వీహెచ్ ఫైర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో….. కాంగ్రెస్ లో కొట్లాటకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు ఏకమయ్యారు. ఈ వివాదంపై కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఈ వివాదంపై స్పందించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై కోర్ కమిటీ సమావేశంలో చర్చ […]

రేవంత్ స్పీడ్ తగ్గించుకో.... వీహెచ్ ఫైర్
X

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో….. కాంగ్రెస్ లో కొట్లాటకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు ఏకమయ్యారు.

ఈ వివాదంపై కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఈ వివాదంపై స్పందించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై కోర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని.. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని వీహెచ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అని.. స్పీడ్ బాగా ఎక్కువైందని.. తగ్గించుకోవాలని వీహెచ్ హెచ్చరించారు.

రేవంత్ దూకుడు స్టైల్ ప్రాంతీయపార్టీల్లో నడుస్తుంది కానీ.. కాంగ్రెస్ లో నడవదని వీహెచ్ ఎద్దేవా చేశారు. కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ స్థానంలో సీటు ఇచ్చి గెలిపించామని.. అలాగే మూడు సార్లు గెలిచిన ఉత్తమ్ ప్లేసులో ఆయన భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని వీహెచ్ పేర్కొన్నారు. హుజూర్ నగర్ లో ఎవరు పోటీచేస్తారో చెప్పే హక్కు ఉత్తమ్ కే ఉందని వీహెచ్ స్పష్టం చేశారు.

రేవంత్ తీరు బాలేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ను అవమానించాడని వీహెచ్ మండిపడ్డారు. యురేనియం విషయంలో ఏబీసీడీలు తెలియవంటూ సంపత్ పై నోరుపారేసుకున్నాడని తెలిపారు. రేవంత్ ఇలాగే వెళితే కాంగ్రెస్ లో కష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

First Published:  20 Sept 2019 12:33 PM IST
Next Story