తెలంగాణలో బీజేపీ... ఎక్కువగా ఊహించుకుంటోందా?
తెలంగాణలో అనూహ్యంగా 4 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న బిజెపి… ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా రాకెట్ స్పీడు తో విస్తరించాలని చూస్తున్నది. అందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నది కూడా. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభమేమీ కాదు. ఉద్యమ పార్టీ గా టి.ఆర్.ఎస్ ప్రభ ఇప్పట్లో తగ్గుతుందని అనుకోవాల్సిన పని లేదు. అసలు అధికారం గురించి ఇక్కడ కలలు కనడమేమో గానీ…. ఒకప్పుడు గెలిచిన జిల్లాల లోనే బీజేపీ డిపాజిట్లు దక్కించుకోలేక పోతున్నది. […]
తెలంగాణలో అనూహ్యంగా 4 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న బిజెపి… ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా రాకెట్ స్పీడు తో విస్తరించాలని చూస్తున్నది. అందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నది కూడా.
అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభమేమీ కాదు. ఉద్యమ పార్టీ గా టి.ఆర్.ఎస్ ప్రభ ఇప్పట్లో తగ్గుతుందని అనుకోవాల్సిన పని లేదు.
అసలు అధికారం గురించి ఇక్కడ కలలు కనడమేమో గానీ…. ఒకప్పుడు గెలిచిన జిల్లాల లోనే బీజేపీ డిపాజిట్లు దక్కించుకోలేక పోతున్నది.
ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిజెపి పరిస్థితి ఒక తార్కాణం.
1982లో కేవలం ఇద్దరు ఎంపీలతో బిజెపి పార్లమెంటులో అడుగు పెట్టింది. ఆ ఇద్దరిలో ఒకరు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికైన చందుపట్ల జంగారెడ్డి కావడం విశేషం.
అయితే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలో గానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 12 స్థానాల్లో గానీ…. ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. భూపాలపల్లి లో మాత్రం కాస్త గౌరవప్రదమైన ఓట్లు వచ్చినా అక్కడ కూడా డిపాజిట్ దక్కలేదు.
దీనికి కారణం… మొదటితరం నాయకులు అని చెప్పుకుంటూ కొందరు నాయకులు పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటూ… దాని ఎదుగుదలకు గండి కొడుతుండటమే కారణమని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
చక్రం తిప్పే ఒకరిద్దరి చేతుల్లోనే పార్టీ ఉండటం, కొత్తవారు ఎవరైనా వస్తే వారిని ప్రోత్సహించకపోవడం కూడా పార్టీ దీనస్థితికి కారణమని కార్యకర్తలు అంటున్నారు.
ఇక పార్టీ నిర్మాణ కార్యక్రమాల విషయానికొస్తే… ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క భూపాలపల్లిలో తప్ప ఎక్కడా ఏ స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు లేరు. వరంగల్ అర్బన్ జిల్లాలో నగర జనాభా ఎక్కువ. విద్యావేత్తలు, చదువుకున్నవారు ఎక్కువ. వీరిలో ఎవరినీ బిజెపి ఇక్కడ ఆకర్షించలేక పోతున్నది.