Telugu Global
NEWS

నేడే పోలవరం రివర్స్ టెండరింగ్... పోటీలో ఆరు కంపెనీలు ఇవే...

పోలవరం రివర్స్ టెండరింగ్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటికే టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించగా… ఆరు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకున్న తర్వాత ఆరు సంస్థలు రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనవచ్చని జలవనరుల శాఖ నిర్ణయించింది. రివర్స్ టెండరింగ్‌లో పెద్దపెద్ద సంస్థలు పాల్గొంటున్నాయి. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన ఘేఘా ఇంజనీరింగ్‌ సంస్థ […]

నేడే పోలవరం రివర్స్ టెండరింగ్... పోటీలో ఆరు కంపెనీలు ఇవే...
X

పోలవరం రివర్స్ టెండరింగ్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటికే టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించగా… ఆరు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకున్న తర్వాత ఆరు సంస్థలు రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనవచ్చని జలవనరుల శాఖ నిర్ణయించింది.

రివర్స్ టెండరింగ్‌లో పెద్దపెద్ద సంస్థలు పాల్గొంటున్నాయి. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన ఘేఘా ఇంజనీరింగ్‌ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసింది.

మేఘా సంస్థతో పాటు పటేల్ ఇంజనీరింగ్‌ లిమిటెడ్, మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, ఆర్‌ఆర్‌సీఐఐపీఎల్ సంస్థలు టెండరింగ్‌లో పాల్గొంటాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 తర్వాత రివర్స్‌ టెండర్ల పక్రియ ప్రారంభమవుతుంది.

First Published:  20 Sept 2019 12:35 AM IST
Next Story