కార్పొరేట్ కంపెనీలకు భారీ రాయితీలు ప్రకటించిన కేంద్రం
దేశంలో ఆర్థిక మందగమనం ఆందోళన కలిగించే దిశగా పయణిస్తుండడంతో కేంద్రం పరిస్థితిని గట్టెక్కించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. పలు ఉద్దీపనలతో ముందుకొస్తోంది. తాజాగా కార్పొరేట్ సంస్థలకు భారీగా ఊరట ఇచ్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, వృద్థి రేటు పెంచేందుకు కార్పొరేట్ సంస్థలకు పన్నుల రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 నుంచి […]
దేశంలో ఆర్థిక మందగమనం ఆందోళన కలిగించే దిశగా పయణిస్తుండడంతో కేంద్రం పరిస్థితిని గట్టెక్కించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. పలు ఉద్దీపనలతో ముందుకొస్తోంది.
తాజాగా కార్పొరేట్ సంస్థలకు భారీగా ఊరట ఇచ్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, వృద్థి రేటు పెంచేందుకు కార్పొరేట్ సంస్థలకు పన్నుల రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు.
దేశీయ కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతం నుంచి 15 శాతం తగ్గించారు. అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ రంగం కంపెనీలు 15శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇప్పటి వరకు కొత్త కంపెనీ కార్పొరేట్ పన్ను 25 శాతం ఉండగా… సర్‌చార్జ్, సెస్‌తో కలిపితే అది 29. 12 శాతంగా ఉండేది.
తాజా మార్పుతో కొత్త సంస్థలకు కార్పొరేట్ పన్ను(సర్‌చార్జ్, సెస్ కలిపి) 17.01 శాతం మాత్రమే. కార్పొరేట్ పన్నుల్లో కోత వల్ల ప్రభుత్వానికి లక్షా 45 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుంది.
కార్పొరేట్ సంస్థలకు ఉద్దీపన రాయితీలు ప్రకటించగానే స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. మధ్నాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1780పాయింట్లు లాభపడి 37, 874 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టి 518 పాయింట్లు జంప్ అయింది. పలు ఆటో, సిమెంట్ కంపెనీల షేర్లు 16 శాతం మేర లాభపడ్డాయి.