Telugu Global
NEWS

అంతిమ యాత్రలో విక్టరీ సింబలా? ఇదేనా నీ సంస్కారం?

అధికారం కోల్పోయే సరికి చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎస్‌ఐ నుంచి డీజీపీ వరకు సొంత అవసరాల కోసం వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు డ్రామాలు మొదలుపెట్టారని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో ముద్రగడ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్న చంద్రబాబు… దానిపై కేసు నమోదు కాకుండా ఉండేందుకు సీసీ కెమెరా ఫుటేజ్‌ను మాయం చేయించింది నిజం కాదా […]

అంతిమ యాత్రలో విక్టరీ సింబలా? ఇదేనా నీ సంస్కారం?
X

అధికారం కోల్పోయే సరికి చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎస్‌ఐ నుంచి డీజీపీ వరకు సొంత అవసరాల కోసం వాడుకున్నారని విమర్శించారు.

ఇప్పుడు ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు డ్రామాలు మొదలుపెట్టారని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో ముద్రగడ మండిపడ్డారు.

గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్న చంద్రబాబు… దానిపై కేసు నమోదు కాకుండా ఉండేందుకు సీసీ కెమెరా ఫుటేజ్‌ను మాయం చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అంతిమయాత్రలో ఎవరైనా మౌనంగా ఉంటారని కానీ కోడెల అంతిమయాత్ర సందర్భంగా చంద్రబాబు మాత్రం విక్టరీ సింబల్‌ చూపుతూ హడావుడి చేశారని…. ఇదేనా చంద్రబాబు సంస్కారం అని నిలదీశారు. కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు చేసిన నటనంతా రాజకీయం కోసమేనన్నారు.

కాపు జాతి ఉద్యమం చేస్తే కేసులు పెట్టించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు వల్ల అనేక మంది కాపులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన చెందారు. ఇవాళ ఏపీలో మీడియా గొంతు నొక్కేస్తున్నారని తెగ వాపోతున్నారని… కానీ కాపు ఉద్యమ సమయంలో ఇదే మీడియాను…. కాపు ఉద్యమ వార్తలు చూపించకుండా అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు అరాచక పాలనలో సామాన్యులు బతికే అవకాశం కూడా లేకుండపోయిందన్నారు. చంద్రబాబు రాక్షస పాలనతో ఏపీ భ్రష్టుపట్టిపోయిందన్నారు. మనుషులను హీనంగా చూసి అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. దొంగమాటలు చెబుతూ, దొంగ కన్నీరు కారుస్తూ ఇంకా ఎంత కాలం నటిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు ముద్రగడ.

First Published:  20 Sept 2019 10:14 AM IST
Next Story