Telugu Global
NEWS

కోడెలను చంపింది కొడుకే... హైకోర్టులో పిల్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన అభిమానులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడెల శివరాం కారణంగానే శివప్రసాదరావు చనిపోయాడని ఇప్పటికే ఆయన మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇప్పుడు ఆయన అభిమాని, గుంటూరు జిల్లాకు చెందిన బొరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టులో పిల్ వేశాడు. కోడెల అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. కోడెల శివప్రసాదరావు అభిమానిగా తాను ఈ పిటిషన్ వేశానని అనిల్ చెప్పారు. […]

కోడెలను చంపింది కొడుకే... హైకోర్టులో పిల్
X

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన అభిమానులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడెల శివరాం కారణంగానే శివప్రసాదరావు చనిపోయాడని ఇప్పటికే ఆయన మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

ఇప్పుడు ఆయన అభిమాని, గుంటూరు జిల్లాకు చెందిన బొరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టులో పిల్ వేశాడు. కోడెల అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.

కోడెల శివప్రసాదరావు అభిమానిగా తాను ఈ పిటిషన్ వేశానని అనిల్ చెప్పారు. రాజకీయ నాయకులన్న తర్వాత కేసులు సహజమని వాటికి భయపడి ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కోడెల కాదని అతడు అభిప్రాయపడ్డాడు. కోడెలది ఖచ్చితంగా హత్యేనని వ్యాఖ్యానించాడు. ఈ హత్య వెనుక కోడెల శివరాం హస్తముందని తాను నమ్ముతున్నానని చెప్పాడు.

తనపై అనేక ఆరోపణలు, కేసులు నమోదైన నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకునేందుకు తండ్రిని శివరాం హత్య చేయించి ఉంటాడని అనిల్ కుమార్ ఆరోపించారు. కోడెల మృతిని రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అనిల్ కుమార్ మండిపడ్డాడు. కోడెల మృతి వెనుక అసలు కారణం బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని హైకోర్టుకు బొరగడ్డ అనిల్ విన్నవించుకున్నారు.

First Published:  20 Sept 2019 10:47 AM IST
Next Story