Telugu Global
NEWS

జనసేన ట్విట్టర్ ఖాతాలు వెనక్కి

ఇటీవల జనసేన పార్టీకి చెందిన 400 క్రియాశీల ట్విట్టర్ ఖాతాలను సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్వీట్ చేసి ఫిర్యాదులు చేశారు. ‘#BringBackJSPSocialMedia’ ట్యాగ్ తో సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ పట్ల నిరసన తెలిపాడు. ఈ యాష్ ట్యాగ్ తో జనసైనికులంతా ట్విట్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా సాగించిన ఈ ట్వీట్ వార్ […]

జనసేన ట్విట్టర్ ఖాతాలు వెనక్కి
X

ఇటీవల జనసేన పార్టీకి చెందిన 400 క్రియాశీల ట్విట్టర్ ఖాతాలను సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్వీట్ చేసి ఫిర్యాదులు చేశారు. ‘#BringBackJSPSocialMedia’ ట్యాగ్ తో సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ పట్ల నిరసన తెలిపాడు.

ఈ యాష్ ట్యాగ్ తో జనసైనికులంతా ట్విట్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా సాగించిన ఈ ట్వీట్ వార్ తో ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చింది. జనసేనకు చెందిన 400 ట్విట్టర్ ఖాతాలను తాజాగా మళ్లీ పునరుద్దరించింది.

పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ ఇండియాను టార్గెట్ చేసి ‘బ్రింగ్ బ్యాక్ జనసేన సోషల్ మీడియా’ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ప్రశ్నించారు. నిస్సహాయులు, వారి సమస్యలను తెలుసుకొని అండగా ఉంటున్న మేము చేస్తున్నది తప్పా అని ప్రశ్నించారు.

ఫలితంగా ఈ వార్ ట్విట్టర్ కు తాకింది. వెంటనే ట్విట్టర్ ఇండియా యాజమాన్యం తప్పు సరిదిద్దుకుంది. వెంటనే 400 ఖాతాలను మళ్లీ పునరుద్దరించింది. శుక్రవారం ఆ ఖాతాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీనిపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అకౌంట్లు తిరిగి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ట్విట్టర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

First Published:  20 Sept 2019 11:13 AM IST
Next Story