Telugu Global
NEWS

హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అజర్ పోటీ

అధ్యక్షపదవికి అజర్ నామినేషన్ భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్…హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల బరిలో నిలిచాడు. అధ్యక్షపదవికి నామినేషన్ దాఖలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై భారత న్యాయస్థానాల నుంచి క్లీన్ చిట్ అందుకొన్న 57 ఏళ్ల అజరుద్దీన్ గతంలో సైతం హెచ్ సిఏ ఎన్నికల బరిలో నిలిచినా నామినేషన్ ను తిరస్కరించారు. అయితే…ఈ సారిమాత్రం అజర్ నిబంధనలకు అనుగుణంగానే తగిన అర్హతలతో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవికి పోటీలో నిలిచారు. ఈ నెల 27న జరిగే […]

హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అజర్ పోటీ
X
  • అధ్యక్షపదవికి అజర్ నామినేషన్

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్…హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల బరిలో నిలిచాడు. అధ్యక్షపదవికి నామినేషన్ దాఖలు చేశాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై భారత న్యాయస్థానాల నుంచి క్లీన్ చిట్ అందుకొన్న 57 ఏళ్ల అజరుద్దీన్ గతంలో సైతం హెచ్ సిఏ ఎన్నికల బరిలో నిలిచినా నామినేషన్ ను తిరస్కరించారు.

అయితే…ఈ సారిమాత్రం అజర్ నిబంధనలకు అనుగుణంగానే తగిన అర్హతలతో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవికి పోటీలో నిలిచారు.

ఈ నెల 27న జరిగే హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలలో అజరుద్దీన్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు.

1990 దశకంలో ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా అజర్ కు పేరుంది. భారత్ తరపున 99 టెస్ట్ మ్యాచ్ లు, 334 వన్డే మ్యాచ్ లు ఆడిన అపారఅనుభవం అజర్ కు ఉంది. అంతేకాదు…భారత జట్టలకు 47 టెస్టులు, 174 వన్డేలతో పాటు… మూడు ప్రపంచకప్ టో్ర్నీలలో నాయకత్వం వహించిన ఏకైక ఆటగాడుఅజరుద్దీన్ మాత్రమే.

కుట్రలు, కుతంత్రాలు, ముఠాల కుమ్ములాటలకు మరో పేరైన హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవికి అజర్ ఈసారైనా ఎన్నిక కాగలడా…వేచిచూడాల్సిందే.

First Published:  19 Sept 2019 7:03 PM GMT
Next Story