జేసీ దివాకర్ రెడ్డిపై "త్రిశూల్"
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. చాలాకాలంగా నడుస్తున్న త్రిశూల్ సిమెంట్ కంపెనీ వ్యవహారంలో కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లా యాడికి మండలంలో త్రిశూల్ సిమెంట్ పేరుతో 1,605 ఎకరాలు తీసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్న వ్యవహారంలో దివాకర్ రెడ్డితో పాటు కంపెనీ భాగస్వాములుగా ఉన్న మరో ముగ్గురికి నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది కోర్టు. మోసపూరితంగా లైమ్ స్టోన్ […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. చాలాకాలంగా నడుస్తున్న త్రిశూల్ సిమెంట్ కంపెనీ వ్యవహారంలో కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
అనంతపురం జిల్లా యాడికి మండలంలో త్రిశూల్ సిమెంట్ పేరుతో 1,605 ఎకరాలు తీసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్న వ్యవహారంలో దివాకర్ రెడ్డితో పాటు కంపెనీ భాగస్వాములుగా ఉన్న మరో ముగ్గురికి నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది కోర్టు.
మోసపూరితంగా లైమ్ స్టోన్ లీజు అనుమతులను జేసీ దివాకర్ రెడ్డి పొందారని, త్రిశూల్ సిమెంట్‌లో ఉన్న భాగస్వాములంతా జేసీ బినామీలేనని ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ తాడిపత్రికి చెందిన మురళీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో 2011లోనే పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పుడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.