Telugu Global
NEWS

మొహాలీ టీ-20లో భారత్ అలవోక గెలుపు

విరాట్ కొహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో 7 వికెట్ల విజయం వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ బోణీ కొట్టింది. మొహాలీ వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 7 వికెట్ల తేడాతో సఫారీలపై అలవోక విజయం సాధించింది. కెప్టెన్లే టాప్ స్కోరర్లు… అంతకు ముందు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో సఫారీ టీమ్ ముందుగా […]

మొహాలీ టీ-20లో భారత్ అలవోక గెలుపు
X
  • విరాట్ కొహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో 7 వికెట్ల విజయం

వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ బోణీ కొట్టింది.

మొహాలీ వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 7 వికెట్ల తేడాతో సఫారీలపై అలవోక విజయం సాధించింది.

కెప్టెన్లే టాప్ స్కోరర్లు…

అంతకు ముందు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో సఫారీ టీమ్ ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. సౌతాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డి కాక్ 37 బాల్స్ లో 8 బౌండ్రీలతో 52 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వైస్ కెప్టెన్ బవుమా 49 పరుగులకు అవుటయ్యాడు.

చివరకు సఫారీ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో పేసర్ దీపక్ చహార్ 2 వికెట్లు, సైనీ, జడేజా, హార్థిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

విరాట్ కొహ్లీ షో…

150 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు.

రోహిత్ రెండు సిక్సర్లతో 12 పరుగులకే అవుట్ కాగా…ధావన్- కొహ్లీ జోడీ రెండో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు. ధావన్ 40, పంత్ 4 పరుగులకు వెనుదిరిగారు.

కెప్టెన్ కొహ్లీ- శ్రేయస్ అయ్యర్ 5వ వికెట్ కు 44 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ..మరో ఓవర్ మిగిలిఉండగానే భారత్ కు 7 వికెట్ల విజయం అందించారు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ 52 బాల్స్ లో 3 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 72 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు, అయ్యర్ 16 పరుగులతో అజేయంగా నిలిచాడు.

3వ ర్యాంకర్ సౌతాఫ్రికా పై 4వ ర్యాంకర్ భారత్ కు ఇది 9వ విజయం కావడం విశేషం.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి టీ-20 బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 22న జరుగుతుంది.

First Published:  19 Sept 2019 6:03 AM IST
Next Story