Telugu Global
NEWS

కాంగ్రెస్ లో కొట్లాట.... కేసీఆర్ కు అవకాశం...

‘ఒక రొట్టె ముక్క కోసం రెండు పిల్లులు తగువులాడుకుంటే మధ్యలో వచ్చిన కోతి దాన్ని ఎత్తుకుపోయిందట..’ అలానే ఉంది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కొట్లాట. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.. అలాంటి పార్టీ అదే తెలంగాణలో రెండు సార్లు వరుసగా ఓడిపోయింది. అలాంటప్పుడు నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడాలి. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తగ్గడం లేదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలు ఎదుర్కొన్న పార్టీ తెలంగాణలో ఘోరంగా ఓడిపోయింది. […]

కాంగ్రెస్ లో కొట్లాట.... కేసీఆర్ కు అవకాశం...
X

‘ఒక రొట్టె ముక్క కోసం రెండు పిల్లులు తగువులాడుకుంటే మధ్యలో వచ్చిన కోతి దాన్ని ఎత్తుకుపోయిందట..’ అలానే ఉంది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కొట్లాట. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.. అలాంటి పార్టీ అదే తెలంగాణలో రెండు సార్లు వరుసగా ఓడిపోయింది. అలాంటప్పుడు నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడాలి. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తగ్గడం లేదు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలు ఎదుర్కొన్న పార్టీ తెలంగాణలో ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న అనైక్యత, ఆధిపత్య ధోరణి, ఒకరి పెత్తనాన్ని ఒకరు సహించలేకపోవడం…. కలిసికట్టుగా ముందుకు సాగకపోవడంతో ఓటమి ఎదురైంది.

మరి ఇప్పటికైనా అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్ నేతలంతా కలిసి సాగితే పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కానీ ఇక్కడే నేతల ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. బయట నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ ఓవైపు దూసుకుపోతుండగా.. అనాదిగా కాంగ్రెస్ లోనే ఉన్న ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలు ఒక్కటవుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కొట్లాటకు దిగుతున్నారు.

ఇదే కాదు.. చాలా విషయాల్లో కాంగ్రెస్ నేతల మధ్య పొసగడం లేదు.. పీసీసీ చీఫ్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తూ ప్రత్యర్థులను నీరుగార్చే ఎత్తుగడలు వేస్తున్నారు.

అయితే కాంగ్రెసోళ్ల లొల్లి మాత్రం టీఆర్ఎస్ లో సంతోషాన్ని నింపుతోందట. హుజూర్ నగర్ లో అభ్యర్థి ప్రకటనతోనే కాంగ్రెస్ లో ఇంత గొడవ జరిగితే… ఇక నిలబెట్టిన అభ్యర్థిని ఎలా గెలిపించుకుంటారన్న ప్రశ్న గులాబీ దళంలో వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేసీఆర్…. ఇదే అదునుగా హుజూర్ నగర్ లో బలమైన అభ్యర్థిని దింపి చేజిక్కించుకోవాలని యోచిస్తున్నారట…. కాంగ్రెస్ లో కొట్లాటను కేసీఆర్ అవకాశంగా మార్చుకోబోతున్నారట.

First Published:  19 Sept 2019 10:37 AM IST
Next Story