ఆర్ఆర్ఆర్.. కేవలం 3 పాటలే
ఓవైపు ఎంత రహస్యంగా ఉంచుదామని ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి లీకులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. ఈ సినిమాలో కేవలం 3 పాటలే ఉంటాయట. నాలుగో పాట ఉన్నప్పటికీ అది మాంటేజ్ సాంగ్ అనే ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఇద్దరు హీరోలంటే చెరో 2 పాటలు వేసుకున్నా 4 డ్యూయట్స్ ఉండాల్సిందే. ఒక మాంటేజ్ సాంగ్, […]
ఓవైపు ఎంత రహస్యంగా ఉంచుదామని ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి లీకులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. ఈ సినిమాలో కేవలం 3 పాటలే ఉంటాయట. నాలుగో పాట ఉన్నప్పటికీ అది మాంటేజ్ సాంగ్ అనే ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఇద్దరు హీరోలంటే చెరో 2 పాటలు వేసుకున్నా 4 డ్యూయట్స్ ఉండాల్సిందే. ఒక మాంటేజ్ సాంగ్, మరో సిచ్యువేషనల్ సాంగ్.. మొత్తంగా 6 పాటలు మస్ట్ గా ఉండాలి. కానీ ఆర్-ఆర్-ఆర్ ను మాత్రం 3 పాటలకే పరిమితం చేశారట. వీటిలో 2 పాటలు చెరో హీరోకు డ్యూయట్స్ అయితే.. మిగిలిన ఒక పాటను చరణ్-ఎన్టీఆర్ పై తీస్తారట. ఇంకో పాట మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.
పాటలకు సంబంధించి వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ అనేది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, దీన్నొక ఇండియన్ మూవీగా మలిచే ప్రయత్నం జరుగుతోంది. బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేసే మూవీగా రాబోతోంది. అందుకే అందర్నీ ఆకట్టుకునేలా పూర్తిగా కథ, స్క్రీన్ ప్లే పై దృష్టిపెట్టి పాటల్ని కావాలనే తగ్గించారట.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బల్గేరియాలో షెడ్యూల్ నడుస్తోంది. ఎన్టీఆర్ పై అక్కడొక పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో 2 రోజుల్లో యూనిట్ బల్గేరియా నుంచి రిటర్న్ అవుతుంది. ఆ తర్వాత చరణ్ పై మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.