జనసేనకు ట్విట్టర్ భారీ షాక్... 400 ఫేక్ అకౌంట్లపై వేటు
జనసేన పార్టీకి ట్విట్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. జనసేన పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న 400 అకౌంట్లను రద్దు చేసింది. ఈ అకౌంట్లు అనధికారికంగా, అనుమానాస్పదంగా కొనసాగుతుండడం, తీవ్ర పదజాలంతో, సమాజంలో ఇబ్బందులు సృష్టించేలా ఈ అకౌంట్లలో పోస్టులు ఉండడంతో ట్విట్టర్ వేటు వేసినట్టు భావిస్తున్నారు. ఈ అకౌంట్ల ద్వారానే జనసేన తన ప్రచారంతో పాటు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ వస్తోంది. అయితే ఈ అకౌంట్లలోని కంటెంట్‌పై తీవ్ర స్థాయిలో రిపోర్టులు వెళ్లి ఉంటాయని… అందుకే ట్విట్టర్ ఇంతటి తీవ్ర […]
జనసేన పార్టీకి ట్విట్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. జనసేన పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న 400 అకౌంట్లను రద్దు చేసింది. ఈ అకౌంట్లు అనధికారికంగా, అనుమానాస్పదంగా కొనసాగుతుండడం, తీవ్ర పదజాలంతో, సమాజంలో ఇబ్బందులు సృష్టించేలా ఈ అకౌంట్లలో పోస్టులు ఉండడంతో ట్విట్టర్ వేటు వేసినట్టు భావిస్తున్నారు.
ఈ అకౌంట్ల ద్వారానే జనసేన తన ప్రచారంతో పాటు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ వస్తోంది. అయితే ఈ అకౌంట్లలోని కంటెంట్‌పై తీవ్ర స్థాయిలో రిపోర్టులు వెళ్లి ఉంటాయని… అందుకే ట్విట్టర్ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని… నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తమ పార్టీకి చెందిన 400 అకౌంట్లను ట్విట్టర్ ఎత్తివేయడంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన మద్దతుదారుల ట్విట్టర్ అకౌంట్ల నిలిపివేతను ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించారు. 400 అకౌంట్లు ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. వాటిని తిరిగి వెనక్కి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?#BringBackJSPSocialMedia
— Pawan Kalyan (@PawanKalyan) September 18, 2019