Telugu Global
NEWS

బాబు రాజకీయం... కోడెలకు అధికార లాంఛనాల తిరస్కరణ వెనుక...

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య నుంచి వీలైనంత మైలేజ్ పొందేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కోడెల ఆత్మహత్యను ప్రభుత్వానికి అంటగడితే ఇక మిగిలిన టీడీపీ నేతలపై కేసులు ఉండవన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ రాజకీయం ఎంత వరకు వచ్చిందంటే కోడెల అంత్యక్రియలను లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే వరకు వెళ్లింది. ఏ కుటుంబసభ్యులైనా మృతిచెందిన తమ వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నారు. […]

బాబు రాజకీయం... కోడెలకు అధికార లాంఛనాల తిరస్కరణ వెనుక...
X

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య నుంచి వీలైనంత మైలేజ్ పొందేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

కోడెల ఆత్మహత్యను ప్రభుత్వానికి అంటగడితే ఇక మిగిలిన టీడీపీ నేతలపై కేసులు ఉండవన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ రాజకీయం ఎంత వరకు వచ్చిందంటే కోడెల అంత్యక్రియలను లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే వరకు వెళ్లింది.

ఏ కుటుంబసభ్యులైనా మృతిచెందిన తమ వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నారు. కానీ నడుస్తున్న టీడీపీ రాజకీయం అందుకు భిన్నంగా ఉంది.

కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదని కోడెల కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు ప్రకటించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. దాంతో టీడీపీ నేతలే షాక్ అయ్యారు. ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించడం ఏమిటిని చర్చించుకుంటున్నారు.

అయితే ఇదంతా కోడెల అంత్యక్రియల్లో ఆయన శవం వెంటే ఉన్న చంద్రబాబు డైరెక్షన్ అని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ లాంఛనాలకు అంగీకరిస్తే కోడెల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యేకమైన వ్యతిరేక భావం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు… ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న వాదన బలహీన పడుతుందన్న ఉద్దేశంతోనే…. అధికార లాంఛనాలను తిరస్కరించేలా చంద్రబాబు ప్లాన్ చేశారని చెబుతున్నారు.

ఇప్పటికే కోడెల శివరాం, కోడెల కుమార్తె విజయలక్ష్మిపై భారీగా బాధితులు కేసులు పెట్టిన నేపథ్యంలో వాటినుంచి తప్పించుకునేందుకు… చంద్రబాబు చెప్పినట్టు ప్రభుత్వ వేధింపులు అన్న లైనే కరెక్ట్ అని కోడెల కుటుంబసభ్యులు కూడా భావిస్తుండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ రాజకీయం కారణంగానే ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన కోడెల…. చివరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు కూడా నోచుకోలేని పరిస్థితి వచ్చిందని నరసరావుపేటలోని కోడెల అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

First Published:  18 Sept 2019 5:18 AM IST
Next Story