మళ్లీ చంద్రముఖి గా మారుతున్న చంద్రబాబు... సీబీఐ జపం...
జనం గొర్రెలు అన్న భావన బాగా బలంగా ఉన్నవారిలో చంద్రబాబు అగ్రజుడు అనే చెప్పాలి. గిరీశం చెప్పిన రాజకీయ నాయకుడి లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి బాబు గారు. గడిచిన ఐదేళ్లలో బాబు తీసుకున్న యూ టర్న్ ల వల్ల.. రోడ్డు పై యూ టర్న్ వస్తేనే బాబు గుర్తుకు వచ్చే పరిస్థితి. సరే అధికారంలో ఉన్నప్పుడు తప్పలేదు అని చాలా మంది సరిపెట్టుకున్నారు. కానీ ఆ రంగులు మార్చే గుణం పాలనలో నెట్టుకు రావడం […]
జనం గొర్రెలు అన్న భావన బాగా బలంగా ఉన్నవారిలో చంద్రబాబు అగ్రజుడు అనే చెప్పాలి. గిరీశం చెప్పిన రాజకీయ నాయకుడి లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి బాబు గారు.
గడిచిన ఐదేళ్లలో బాబు తీసుకున్న యూ టర్న్ ల వల్ల.. రోడ్డు పై యూ టర్న్ వస్తేనే బాబు గుర్తుకు వచ్చే పరిస్థితి. సరే అధికారంలో ఉన్నప్పుడు తప్పలేదు అని చాలా మంది సరిపెట్టుకున్నారు. కానీ ఆ రంగులు మార్చే గుణం పాలనలో నెట్టుకు రావడం కోసం కాదు… అది ఆయన బ్లడ్ లోనే ఉన్న విశేషమని ప్రతి పక్షంలో కి వచ్చాకా కూడా ఆయన చేస్తున్న విన్యాసాలు బట్టి తేలిపోతోంది.
కోడెల ఆత్మహత్య వ్యవహారంలో బాబు తీరు చంద్రముఖి ని తలపిస్తూ అందరితోనూ ‘వాయ్యా’ అంటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపిస్తున్నారు. కోడెల దూడలు రెండు నియోజక వర్గాల ప్రజలను కాల్చుకు తింటుంటే కళ్ళు మూసుకున్న బాబు… బాధితులు పెట్టిన కేసులను వేధింపులు అంటూ 40 ఏళ్ళ రాజకీయానికి సిగ్గు వదిలేశారు.
పైగా కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేయడం టీడీపీ నేతలను కంగు తినేలా చేసింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం తరహాలో చాటుకు వెళ్లి గొల్లున నవ్వుకున్నట్టుగా టీడీపీ నేతల పరిస్థితి తయారైంది.
ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో సిబిఐకి విశ్వసనీయత లేదని ఏపీలో అడుగు పెట్టకుండా నిషేధించింది చంద్రబాబే. ఇప్పుడు సీబీఐ విచారణ కావాలంటున్నారు అంటే ఏమనుకోవాలి?. ఇప్పుడు ఉన్నది కూడా మోడీ ప్రభుత్వమే కదా?. బహుశా బీజేపీలో చేరిన తన ముఠా సభ్యులు తిరిగి సీబీఐ మీద పట్టు సాధించారా?. సీబీఐ లోకి తిరిగి ఏజెంట్లను చేర్చారా?…. అన్నట్టు గడిచిన ఐదేళ్లలో సీబీఐ ఏపీలో అడుగు పెడితే పెట్టుబడులు రావంటూ కథలు చెప్పింది కూడా ఈ బాబు గారే. కాకపోతే ఇప్పుడు ఆయన చంద్రముఖి గా మారారు అంతే.