హైదరాబాద్ విలీనంపై మోడీ హాట్ కామెంట్
ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం.. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ‘సేవ్ సప్తాహ్’ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు మరో విశేషం కూడా ఉంది. అదే నిజాం నిరకుంశ పాలనలో మగ్గిన హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిన రోజు. దేశ తొలి ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ పై సైనిక చర్యకు దిగి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన రోజు. అయితే తాజాగా తన సొంతరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న మోడీ… తన బర్త్ […]
ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం.. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ‘సేవ్ సప్తాహ్’ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు మరో విశేషం కూడా ఉంది. అదే నిజాం నిరకుంశ పాలనలో మగ్గిన హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిన రోజు. దేశ తొలి ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ పై సైనిక చర్యకు దిగి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన రోజు.
అయితే తాజాగా తన సొంతరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న మోడీ… తన బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విలీనంపై హాట్ కామెంట్ చేశారు. హైదరాబాద్ ను ఆనాడు విలీనం చేసిన ఘనత సర్ధార్ వల్లభాయ్ పటేల్ దే అన్నారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ప్రస్తుతం అభివృద్ధిలో దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నేతలు గళమెత్తుతూ ఆందోళన చేస్తున్న వేళ ఇదే తెలంగాణ విమోచనంపై మోడీ మాటలు బీజేపీ శ్రేణుల్లో బూస్ట్ ఇచ్చాయి.
తెలంగాణ విమోచనంపై మోడీ స్పందించి టీఆర్ఎస్ నేతలకు ఓ రకంగా మోడీ షాకిచ్చినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. అయితే ఇప్పుడు మోడీ మాత్రం వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణ విముక్తి అయ్యిందన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి.