1971 లో సునీల్ గవాస్కర్... 2019లో స్టీవ్ స్మిత్
గవాస్కర్ సరసన స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్ లో స్మిత్ 774 పరుగులు ఇంగ్లండ్ తో ముగిసిన యాషెస్ సిరీస్ ను ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పరుగుల హోరు, సెంచరీల జోరుతో ముగించాడు. భారత దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న గత నాలుగుదశాబ్దాల రికార్డును స్టీవ్ స్మిత్ సమం చేయడమే కాదు.. భారత దిగ్గజ ఓపెనర్ సరసన నిలిచాడు. 1971 కరీబియన్ టూర్ లో ఆడిన నాలుగు టెస్టుల్లో భారత ఓపెనర్ గా […]
- గవాస్కర్ సరసన స్టీవ్ స్మిత్
- యాషెస్ సిరీస్ లో స్మిత్ 774 పరుగులు
ఇంగ్లండ్ తో ముగిసిన యాషెస్ సిరీస్ ను ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పరుగుల హోరు, సెంచరీల జోరుతో ముగించాడు. భారత దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న గత నాలుగుదశాబ్దాల రికార్డును స్టీవ్ స్మిత్ సమం చేయడమే కాదు.. భారత దిగ్గజ ఓపెనర్ సరసన నిలిచాడు.
1971 కరీబియన్ టూర్ లో ఆడిన నాలుగు టెస్టుల్లో భారత ఓపెనర్ గా సునీల్ గవాస్కర్ 774 పరుగులు సాధించడం ద్వారా.. ఓ టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల వరుసలో రెండో స్థానం సాధించాడు.
నాలుగు దశాబ్దాల విరామం తర్వాత…ఇప్పుడు అదే రికార్డును ప్రస్తుత యాషస్ సిరీస్ ద్వారా స్టీవ్ స్మిత్ సమం చేయగలిగాడు.
పాంచ్ పటాకా యాషెస్ సిరీస్ లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన స్టీవ్ స్మిత్ మూడు సెంచరీలు, మూడు హఫ్ సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా 774 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెన్ స్టోక్స్ తో కలసి సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం అందుకోగలిగాడు.
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ క్రికెట్ ర్యాంక్ ను సైతం…స్మిత్ చేజిక్కించుకోగలిగాడు.
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ కేవలం ఒకే ఒక్క టెస్ట్ సిరీస్ ద్వారా పరుగులు, సెంచరీలు సాధించడంతో… నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా నిలువగలిగాడు.