Telugu Global
NEWS

ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ రివర్స్ ఎటాక్

2-2తో డ్రాగా ముగిసిన యాషెస్ సిరీస్  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జోఫ్రా ఆర్చర్  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. మొదటి నాలుగుటెస్టులు ముగిసే సమయానికే 2-1తో సిరీస్ ఖాయం చేసుకొన్న కంగారూటీమ్ కు…ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ లో 135 పరుగుల పరాజయం తప్పలేదు. అయితే..గత సిరీస్ లో […]

ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ రివర్స్ ఎటాక్
X
  • 2-2తో డ్రాగా ముగిసిన యాషెస్ సిరీస్
  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జోఫ్రా ఆర్చర్
  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ స్టీవ్ స్మిత్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.

మొదటి నాలుగుటెస్టులు ముగిసే సమయానికే 2-1తో సిరీస్ ఖాయం చేసుకొన్న కంగారూటీమ్ కు…ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ లో 135 పరుగుల పరాజయం తప్పలేదు.

అయితే..గత సిరీస్ లో విజేతగా నిలిచిన ఆస్ట్ర్రేలియా…సిరీస్ డ్రాగా ముగిసినా ట్రోఫీని నిలబెట్టుకోగలిగింది.

జోఫ్రా ఆర్చర్ సూపర్ షో…

ఇంగ్లండ్ యువఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మెరుపు బౌలింగ్ తో కంగారూలను ఓవల్ టెస్టులో కకావికలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 399 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియా చివరకు 263 పరుగులకే కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఫైటింగ్ సెంచరీ సాధించినా తనజట్టును.. ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

తొలి ఇన్నింగ్స్ లో ఆర్చర్ 6 వికెట్లు పడగొడితే…రెండో ఇన్నింగ్స్ లో బ్రాడ్, లీచ్ చెరో 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ను విజేతగా నిలిపారు.

ఇంగ్లండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆర్చర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లకు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

ఇంగ్లండ్ గడ్డపై 2001లో చివరిసారిగా యాషెస్ సిరీస్ నెగ్గిన ఆస్ట్ర్రేలియా 18 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి సిరీస్ ను సొంతం చేసుకోగలిగింది.

ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం సిరీస్ నిలుపుకోలేకపోయినా… 2-2తో సమఉజ్జీగా నిలవడం ద్వారా పరువు దక్కించుకోగలిగింది.

ఆఖరి టెస్టులో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ 24 పాయింట్లు సాధించింది.

First Published:  17 Sept 2019 2:00 AM IST
Next Story