కోడెల శివప్రసాద రావు కన్నుమూత
కోడెల శివప్రసాద రావు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెల వివిధ మంత్రి పదవులను నిర్వహించాడు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన కోడెల…. డాక్టర్ గా జీవితం ప్రారంభించి… ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983, 1985, 1989, 1994, 1999, 2014…. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రెండు సార్లు మాత్రం ఓటమిపాలయ్యాడు. వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు కోడెల. […]
కోడెల శివప్రసాద రావు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెల వివిధ మంత్రి పదవులను నిర్వహించాడు.
గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన కోడెల…. డాక్టర్ గా జీవితం ప్రారంభించి… ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు.
1983, 1985, 1989, 1994, 1999, 2014…. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రెండు సార్లు మాత్రం ఓటమిపాలయ్యాడు. వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు కోడెల.
ఎన్టీఆర్ క్యాబినెట్ లో హోం మంత్రిగా ఉన్నప్పుడు వంగవీటి మోహన రంగ హత్య జరగడంతో అప్పుడు ఆయన ఆ పదవిని కోల్పోయాడు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కోడెల స్పీకర్ గా ఎన్నికయ్యాడు.