Telugu Global
NEWS

జగన్... వ్యవసాయ మిషన్ పై ఉన్నత స్థాయి సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ ఉన్నతాధికార్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్ పై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని శనివారం వ్యవసాయ మిషన్ పై నిర్వహించిన సమీక్ష లో ఆయన అన్నారు. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్ పై సమగ్ర యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మిషన్ పై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, […]

జగన్... వ్యవసాయ మిషన్ పై ఉన్నత స్థాయి సమావేశం
X

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ ఉన్నతాధికార్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్ పై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని శనివారం వ్యవసాయ మిషన్ పై నిర్వహించిన సమీక్ష లో ఆయన అన్నారు. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్ పై సమగ్ర యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మిషన్ పై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి వంటివారు పాల్గొన్న ఈ సమావేశంలో… రైతుల చేతికి పంట దిగుబడి వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ మేరకు అక్టోబర్ 15 నాటికి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మార్కెట్ ధరల ను ఎప్పటికప్పుడు తెలుసుకుని రైతు గిట్టుబాటు ధర అందుకునే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

పెసలు, మినుములు, టమోటాలు వంటివాటికి సరైన ధర రావడంలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన పంటల కొనుగోళ్ల కోసం ఏ ప్రణాళికలను రూపొందించుకున్నారు అని అధికారులను ప్రశ్నించారు. తృణధాన్యాల సాగు, మద్దతు ధరలపై దృష్టి పెట్టాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కరువు పరిస్థితులను అధికారులు వివరించగా… రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ లు వచ్చే నెల నుంచి రైతులకు అండగా ఉంటాయని సీఎం చెప్పారు. వ్యవసాయ రంగంపై శ్వేత పత్రాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అట్లాగే వరద జలాల సమగ్ర వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో బకాయి పడిన పెట్టుబడి రాయితీ పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలను నెలాఖరులో రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయ మిషన్ తదుపరి భేటీలో పంట దిగుబడులు, మద్దతు ధర ల అంచనాలు, మార్కెట్ పరిస్థితులను నివేదించాలని చెప్పారు.

రైతులకు తగిన మార్కెట్ అవకాశాలను కల్పించాలని సీఎం ఆదేశించినట్లు ఈ భేటీ తర్వాత వ్యవసాయ మంత్రి కన్నబాబు, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి చెప్పారు.

కన్నబాబు మాట్లాడుతూ… “మార్కెట్ ఇంటెలిజెన్స్ మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు…. రైతు పండించిన పంటను బయట అధిక ధర లకు విక్రయించడానికి కానీ, లేదా రేటు పడిపోయినప్పుడు వాళ్లకు నష్టపరిహారం చెల్లించడానికి కానీ అవసరమైతే నిపుణులను కూడా నియమించుకుని, ప్రత్యేకించి మార్కెటింగ్ శాఖ లో ఒక సెల్ కూడా ఏర్పాటు చేయమని సీఎం గారు ఆదేశించారు” అన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ… “ఉత్పత్తి మార్కెట్ కి వస్తున్న నాటికి మన పర్చేజింగ్ సెంటర్స్ సిద్ధంగా ఉండాలి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సిద్ధం చేయండి” అని సీఎం అన్నట్లు చెప్పారు.

ఇక పశువుల మందులు నాణ్యత పై జరిగిన చర్చ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…. ప్రపంచ స్థాయి మందులను వాడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

First Published:  15 Sept 2019 2:31 AM IST
Next Story