Telugu Global
NEWS

టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల డ్రామా కంపెనీ

తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ కాదని, ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో నడుపుతున్న నాటకాల కంపెనీ అని ఏపీఐసీసీ చైర్మన్, శాసన సభ్యురాలు రోజా విమర్శించారు. “టీడీపీ డ్రామా కంపెనీనీ చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులతో నడుపుతున్నారు. జగన్ పాలనతో ఆయనకు రోజురోజుకు మతి తప్పుతోంది” అని రోజా తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం రోజా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాదరావు, యరపతినేని […]

టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల డ్రామా కంపెనీ
X

తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ కాదని, ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో నడుపుతున్న నాటకాల కంపెనీ అని ఏపీఐసీసీ చైర్మన్, శాసన సభ్యురాలు రోజా విమర్శించారు.

“టీడీపీ డ్రామా కంపెనీనీ చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులతో నడుపుతున్నారు. జగన్ పాలనతో ఆయనకు రోజురోజుకు మతి తప్పుతోంది” అని రోజా తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

శనివారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం రోజా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాదరావు, యరపతినేని వంటి కీచకుల బెడద తొలగిపోయిందని అక్కడి ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఒక్క తెలుగుదేశం నాయకులే విషాదంగా ఉన్నారని రోజా అన్నారు.

“జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనతో ప్రజలు ఆనందంగా ఉంటే అది చూడలేక చంద్రబాబు నాయుడు రోజుకో నాటకం ఆడుతున్నారు. ఇందుకోసం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువస్తున్నారు” అని రోజా మండి పడ్డారు.

తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, బొండా ఉమా, యరపతినేని, చింతమనేని, కోడెల వంటి వారి వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారని, అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదని రోజా ప్రశ్నించారు.

” మీ ప్రచార యావ కోసం గోదావరి పుష్కరాలలో 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు గారు” అని రోజా ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి నేటి వరకూ రాష్ట్ర్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, ఇది చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం నాయకులకు మింగుడు పడడం లేదని రోజా అన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా కరుణించాడని, రాష్ట్రంలో పుష్కలంగా వానలు కురిసి ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని ఆమె అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిలాగే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు బాంధవుడు అనే పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు.

First Published:  15 Sept 2019 4:26 AM IST
Next Story