Telugu Global
NEWS

కోల్ కతా వేదికగా ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత పోటీ

భారత్-బంగ్లా సాకర్ సమరం నేడే ఖతర్ వేదికగా జరిగే 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వాలిఫైయర్స్ ..ఆసియాజోన్ గ్రూప్-ఈ రౌండ్ రాబిన్ లీగ్ పోటీకి…కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం ముస్తాబయ్యింది. ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో భారత్, బంగ్లాదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఐదుజట్ల లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లో భారత్ ఓ ఓటమి, ఓ డ్రా రికార్డుతో నిలిచింది. ఒమాన్ తో జరిగిన తొలిరౌండ్ పోటీలో […]

కోల్ కతా వేదికగా ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత పోటీ
X
  • భారత్-బంగ్లా సాకర్ సమరం నేడే

ఖతర్ వేదికగా జరిగే 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వాలిఫైయర్స్ ..ఆసియాజోన్ గ్రూప్-ఈ రౌండ్ రాబిన్ లీగ్ పోటీకి…కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం ముస్తాబయ్యింది.

ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో భారత్, బంగ్లాదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఐదుజట్ల లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లో భారత్ ఓ ఓటమి, ఓ డ్రా రికార్డుతో నిలిచింది.

ఒమాన్ తో జరిగిన తొలిరౌండ్ పోటీలో 1-2 గోల్స్ తో పోరాడి ఓడిన భారత్.. .రెండోరౌండ్ లో ఆసియా చాంపియన్ ఖతర్ తో జరిగిన మ్యాచ్ ను 0-0తో డ్రాగా ముగించడం ద్వారా తేరుకోగలిగింది.

కోల్ కతా వేదికగా ఈ రోజు జరిగే మూడోరౌండ్ పోటీ కీలకం కానుంది. బంగ్లాదేశ్ తో జరిగే ఈ మ్యాచ్ కు 80 వేలమంది అభిమానులు హాజరుకానున్నారు.

సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టు హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

అంతర్జాతీయ ఫుట్ బాల్ లో భారత్ తరపున 72 గోల్స్ సాధించిన సునీల్ చెత్రీ తనజట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు.

భారత్ ఈ మ్యాచ్ నెగ్గితే… క్వాలిపైయర్స్ గ్రూప్ అవకాశాలు సజీవంగా నిలుపుకొన్నట్లవుతుంది.

First Published:  15 Sept 2019 3:30 AM IST
Next Story