బాబు మనుషులైనా.... ఆ ఇద్దరికీ జగన్ ప్రాధాన్యం
ప్రభుత్వం మారాక ఏపీలో అధికారులు మారిపోయారు. కనుమరుగైన పోలీసులు కీలక స్థానాల్లోకి వచ్చారు. నాడు చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, పోలీసులకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగనంపింది. ఇతర పోస్టులకు పంపించింది. అమరావతి రాజధాని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులను జగన్ సీఎం అయ్యాక పక్కనపెట్టారు. వేరే అధికారులను వీరి స్థానాల్లో నియమించారు. చంద్రబాబుకు నోట్లో నాలుకలా వ్యవహరించిన వీరికి మూడు నెలలుగా పోస్టింగ్ లు కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా జగన్ సంచలన […]
ప్రభుత్వం మారాక ఏపీలో అధికారులు మారిపోయారు. కనుమరుగైన పోలీసులు కీలక స్థానాల్లోకి వచ్చారు. నాడు చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, పోలీసులకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగనంపింది. ఇతర పోస్టులకు పంపించింది.
అమరావతి రాజధాని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులను జగన్ సీఎం అయ్యాక పక్కనపెట్టారు. వేరే అధికారులను వీరి స్థానాల్లో నియమించారు. చంద్రబాబుకు నోట్లో నాలుకలా వ్యవహరించిన వీరికి మూడు నెలలుగా పోస్టింగ్ లు కూడా ఇవ్వలేదు.
అయితే తాజాగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరిగి ఆ ఇద్దరు అధికారులకు జగన్ పోస్టింగ్ లు ఇచ్చారు. కీలక విభాగాలను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చంద్రబాబు హయాంలో ఆయనకు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన అజయ్ జైన్ నాడు విద్యుత్ శాఖతోపాటు రాజధాని అమరావతి బాధ్యతలు నిర్వహించారు. తాజాగా అజయ్ జైన్ కు ఏపీ సీఎం జగన్ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు.
ఇక చంద్రబాబు హయాంలో అమరావతి సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన శ్రీధర్ ను జగన్ పక్కనపెట్టారు. ఇప్పుడు శ్రీధర్ ను సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా నియమించారు జగన్.
రాజధానిలో భూసేకరణ, స్థలాల కేటాయింపు ఒప్పందాల విషయంలో శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. మూడు నెలల తర్వాత జగన్ వీరిద్దరికి మళ్లీ కీలక పోస్టులు కట్టబెట్టడం అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.