Telugu Global
NEWS

భారత బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ బ్యాంగ్ బ్యాంగ్

గత ఐదేళ్లలో పరుగుల హోరు, సెంచరీల జోరు బంగర్ కాంట్రాక్టు పొడిగించని బీసీసీఐ ప్రపంచ నంబర్ వన్ భారతజట్టు బ్యాటింగ్ కోచ్ గా తనకు మరో అవకాశం ఇవ్వకపోడం పట్ల…. గత ఐదేళ్లుగా బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించిన సంజయ్ బంగర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను బ్యాటింగ్ కోచ్ గా ఉన్న సమయంలో భారతజట్టు సాధించిన విజయాలు, టాపార్డర్ బ్యాట్స్ మన్ సాధించిన ఘనతలను బంగర్ మీడియా ముందుంచాడు. బీసీసీఐ ఇటీవలే నిర్వహించిన కోచ్ ల ఎంపికలో చీఫ్ […]

భారత బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ బ్యాంగ్ బ్యాంగ్
X
  • గత ఐదేళ్లలో పరుగుల హోరు, సెంచరీల జోరు
  • బంగర్ కాంట్రాక్టు పొడిగించని బీసీసీఐ

ప్రపంచ నంబర్ వన్ భారతజట్టు బ్యాటింగ్ కోచ్ గా తనకు మరో అవకాశం ఇవ్వకపోడం పట్ల…. గత ఐదేళ్లుగా బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించిన సంజయ్ బంగర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను బ్యాటింగ్ కోచ్ గా ఉన్న సమయంలో భారతజట్టు సాధించిన విజయాలు, టాపార్డర్ బ్యాట్స్ మన్ సాధించిన ఘనతలను బంగర్ మీడియా ముందుంచాడు.

బీసీసీఐ ఇటీవలే నిర్వహించిన కోచ్ ల ఎంపికలో చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ల కాంట్రాక్టు మరో రెండేళ్లపాటు పొడిగించడంతో పాటు..20 శాతం వరకూ వేతనం పెంచాలని కూడా నిర్ణయించింది.

అయితే…బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ ను తొలగించి…అతని స్థానంలో విక్రమ్ రాథోర్ ను నియమించింది.

బాధ మానవసహజం.. బంగర్

భారతజట్టు బ్యాటింగ్ ప్రమాణాలు అసాధారణంగా పెరగడం వెనుక తన శ్రమ ఎంతో ఉందని, తన కాంట్రాక్టు పొడిగించకుండా పక్కన పెట్టడం బాధను కలిగించిందని…అయితే ఆ బాధ తాత్కాలికమేనని సంజయ్ బంగర్ చెప్పాడు.

విదేశీ జట్లకు బ్యాటింగ్ కోచ్ గా తనకు అవకాశాలు వస్తున్నా… స్వదేశం వీడేదిలేదని, ఐపీఎల్ లో ఏదో ఒక ఫ్రాంచైజీకి సేవలు అందించడానికి సిద్ధమని బంగర్ ప్రకటించాడు.

ఏడాదికి 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు వేతనంగా…గత ఐదేళ్లుగా అందుకొంటూ వచ్చిన సంజయ్ బంగర్ ప్రస్తుతం నిరుద్యోగిగా మారిపోయాడు.

పరుగుల జోరు, సెంచరీల హోరు…

భారతజట్టు బ్యాటింగ్ కోచ్ గా…డంకన్ ఫ్లెచర్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రిలతో కలసి గత ఐదేళ్లుగా పని చేయటం తన అదృష్టమని, తనను ఎంతగానో ప్రోత్సహించారని బంగర్ గుర్తు చేసుకొన్నాడు.

బ్యాటింగ్ కోచ్ గా తాను మొత్తం 17 మంది టాపార్డర్ ఆటగాళ్ల ప్రమాణాలు పెంచడం, లోపాలు సవరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని తెలిపాడు.

గత ఐదేళ్లకాలంలో తాను బ్యాటింగ్ కోచ్ గా భారతజట్టు ఆడిన టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ ల్లో …150 సెంచరీలు నమోదు కావడం గర్వకారణమని బంగర్ చెప్పాడు.

విరాట్ కొహ్లీ 43 శతకాలతో టాప్..

భారతజట్టుకు బ్యాటింగ్ కోచ్ గా తాను ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ 43 శతకాలు, రోహిత్ శర్మ 23, శిఖర్ ధావన్ 18,చతేశ్వర్ పూజారా 12 సెంచరీలు సాధించారని బంగర్ ఏకరవు పెట్టాడు.

టెస్ట్ క్రికెట్లో 70, వన్డేల్లో 74, టీ-20ల్లో 6 సెంచరీలు… బంగర్ కోచ్ గా నమోదయ్యాయి.

అంతేకాదు… భారత జట్టు ఆడిన మొత్తం 52 టెస్టుల్లో 30 గెలుపు, 11 ఓటమి, 70 సెంచరీలు నమోదు కాగా… 122 వన్డేల్లో 82 గెలుపు, 35 ఓటమి. 74 శతకాలు. 66 టీ-20 ల్లో 43 గెలుపు, 21 ఓటమి, 6 సెంచరీలు నమోదయ్యాయంటూ బంగర్ తన గణాంకాలను మీడియా ముందుంచాడు.

ఏది ఏమైనా… గత ఐదేళ్ల కాలంలో భారత్ మూడేళ్లపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం, మూడుఫార్మాట్లలోనూ నిలకడగా రాణించడం, విదేశీ టూర్లలో అరుదైన విజయాలు సాధించడం తనకు తీపి గుర్తులుగా మిగిలిపోతాయని బంగర్ తెలిపాడు.

First Published:  14 Sept 2019 7:08 AM IST
Next Story