Telugu Global
National

కార్పొరేట్‌ శక్తులతో బాబు చేతులు కలిపారా?

చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమానికి జాతీయ మీడియా చానళ్లు, పత్రికలు ఇచ్చిన ప్రచారం అసాధారణంగా ఉంది. తన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు చంద్రబాబు నేషనల్ మీడియాను కూడా మేనేజ్ చేశారు అన్న విమర్శలు వచ్చాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జాతీయ మీడియా కూడా టార్గెట్ చేసింది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. గురు, శుక్రవారాల్లో జాతీయ పత్రికలన్నీ ఒకేసారి మూకుమ్మడిగా జగన్‌ ప్రభుత్వంపై దండెత్తాయి. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో జాతీయ పత్రికలు […]

కార్పొరేట్‌ శక్తులతో బాబు చేతులు కలిపారా?
X

చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమానికి జాతీయ మీడియా చానళ్లు, పత్రికలు ఇచ్చిన ప్రచారం అసాధారణంగా ఉంది. తన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు చంద్రబాబు నేషనల్ మీడియాను కూడా మేనేజ్ చేశారు అన్న విమర్శలు వచ్చాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జాతీయ మీడియా కూడా టార్గెట్ చేసింది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

గురు, శుక్రవారాల్లో జాతీయ పత్రికలన్నీ ఒకేసారి మూకుమ్మడిగా జగన్‌ ప్రభుత్వంపై దండెత్తాయి. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో జాతీయ పత్రికలు నెగిటివ్‌గా ఎడిటోరియల్స్ అచ్చేశాయి.

జాతీయ పత్రికలు ఇలా జగన్‌ పాలనపై నెగిటివ్‌గా ఒకేసారి ఎడిటోరియల్స్ రాయడం వెనుక ఏదో మోటివ్‌ పనిచేస్తోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా జాతీయ పత్రికలన్నీ నెగిటివ్‌గా ఎడిటోరియల్స్ రాశాయంటూ… ఇక్కడ టీడీపీ అనుకూల పత్రిక శనివారం కథనాలు రాసేసింది. ఆయా ఆంగ్ల పత్రికల్లో జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఎడిటోరియల్స్‌ను తెలుగులోకి అనువాదం చేసి మరీ తన ఎడిటోరియల్ పేజీలో టీడీపీ పత్రిక ప్రచురించింది.

ఈ ఎడిటోరియల్స్‌ను ఎందుకు తట్టి చూడాల్సి వస్తోందంటే….. చంద్రబాబు హయాంలో కార్పొరేట్ కంపెనీలతో ఎక్కువ ధరకు విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకోగా… వాటి వల్ల ఏపీ ప్రభుత్వంపై భారీగా భారం పడుతోంది. వాటిని పునర్‌ సమీక్షించడం ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా చేస్తానంటున్న జగన్‌ నిర్ణయాన్ని కూడా వ్యాసాలు రాసిన జాతీయ జర్నలిస్టులు ఖండించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ పత్రికలు ప్రజల సొమ్ము ఆదా చేయడాన్ని స్వాగతించకుండా… కార్పొరేట్ శక్తులకు వంతపాడుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది.

ప్రస్తుతం జగన్‌ పాలన విద్యుత్ కంపెనీలకు, బడా కాంట్రాక్టర్లకు, చంద్రబాబుకు ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో బడా కార్పొరేట్ కంపెనీలు, చంద్రబాబు అంతా కలిసి జగన్‌కు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నాయా?. ఇందుకోసం నేషనల్ మీడియాను కూడా మేనేజ్‌ చేశారా? అన్న భావన కలుగుతోంది.

జాతీయ మీడియాలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకుని ప్రచారం చేయించడం ద్వారా పెట్టుబడిదారులు ఏపీ వైపు రాకుండా సమిష్టి కుట్రకు దిగారా? అన్న భావన అయితే నేషనల్ మీడియా ధోరణి అనిపిస్తోంది.

First Published:  14 Sept 2019 4:48 PM IST
Next Story