ఆర్థికంగా దేశమే కాదు... రాష్ట్రం కూడా బాగోలేదు... అయినా ప్రాజెక్టులే ముఖ్యం
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అయినా వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. “ఆర్థికంగా దేశమే కాదు… రాష్ట్రం కూడా బాగోలేదు. ప్రతి రూపాయిని సద్వినియోగం చేయండి. ఎక్కడా దుబారా లేకుండా సాగునీటి ప్రాజెక్టులని పూర్తి చేయండి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారుల నుంచి పూర్తి […]
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అయినా వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.
“ఆర్థికంగా దేశమే కాదు… రాష్ట్రం కూడా బాగోలేదు. ప్రతి రూపాయిని సద్వినియోగం చేయండి. ఎక్కడా దుబారా లేకుండా సాగునీటి ప్రాజెక్టులని పూర్తి చేయండి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వరద భారీగా వచ్చి చేరిందని, అది సముద్రంలోకి వెళ్లిపోకుండా ఒడిసి పట్టుకోవాలని సూచించారు.
“వరద జలాలతో కృష్ణా నీటిపై ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేయండి” అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర్రంలో ఇప్పటి వరకూ వరదకు సంబంధించి సరైన లెక్కలు లేవని, 120 రోజుల పాటు వరద వస్తుందనే అంచనాలను ప్రతీసారీ తప్పుతున్నాయని సీఎం చెప్పారు. “రాష్ట్రంలో కేవలం 30రోజులు మాత్రమే వరద వస్తుందని అంచనా వేయండి. అందుకు అనుగుణంగా వరద నీటిని ప్రాజెక్టుల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోండి” అని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.
సాగునీటి పనుల్లో ఎక్కడా ఎటువంటి కుంభకోణాలు లేకుండా చూడాలని, పొరుగు రాష్ట్ర్రాలతో ఉన్న వివాదాలను పరిష్కరించి ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
“ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పునరావాస కార్యక్రమాల్లో ఉదాసీనంగా, మానవత్వంతో వ్యవహరించాలి” అని సీఎం అధికారులకు సూచించారు.
జిల్లాల మధ్య నీటి కోసం వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని, ఎక్కడ సమస్యలు వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.