Telugu Global
Cinema & Entertainment

సాహో 2 వారాల వసూళ్లు

14 రోజులు గడిచిపోయాయి. బ్రేక్-ఈవెన్ మాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడిలో 60శాతం కూడా వెనక్కి రాని పరిస్థితి. ఇది సాహో కథ. కాదు..కాదు.. సాహో వ్యథ. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతే భారీ రేట్లకు అమ్మారు. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ ముందు బోల్తాకొట్టింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ కోసం అపసోపాలు పడుతోంది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకుంది సాహో సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 81 […]

సాహో 2 వారాల వసూళ్లు
X

14 రోజులు గడిచిపోయాయి. బ్రేక్-ఈవెన్ మాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబడిలో 60శాతం కూడా వెనక్కి రాని పరిస్థితి. ఇది సాహో కథ. కాదు..కాదు.. సాహో వ్యథ. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతే భారీ రేట్లకు అమ్మారు. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ ముందు బోల్తాకొట్టింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ కోసం అపసోపాలు పడుతోంది.

నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకుంది సాహో సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 81 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. సినిమాను 125 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే ఇంకా 44 కోట్ల రూపాయలు రావాలి. ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. మరోవైపు గ్యాంగ్ లీడర్ లాంటి భారీ సినిమా వచ్చేసింది. దీంతో ఆ 44 కోట్లు రావడం కష్టమని ట్రేడ్ తేల్చేసింది.

బయ్యర్లు పోతేపోయారు. వాళ్లకు ఇలాంటి దెబ్బలు అనుభవమే. కనీసం నిర్మాతలైనా సేఫ్ అయ్యారంటే అది కూడా లేదు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లోని 4 ప్రాంతాల్లో స్వయంగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సొంత పంపిణీకి వెళ్లారు. వాళ్లకు కూడా నష్టాలు తప్పలేదు.

మరోవైపు నైజాం నుంచి భారీగా వసూళ్లు వస్తున్నాయన్న మాటే కానీ, అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నిన్నటితో వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 424 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన 2 వారాల షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 30 కోట్లు
సీడెడ్ – రూ. 11.63 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.91 కోట్లు
ఈస్ట్ – రూ. 7.13 కోట్లు
వెస్ట్ – రూ. 5.83 కోట్లు
గుంటూరు – రూ. 7.88 కోట్లు
నెల్లూరు – రూ. 4.32 కోట్లు
కృష్ణా – రూ. 5.20 కోట్లు

First Published:  13 Sept 2019 8:52 AM GMT
Next Story