Telugu Global
National

సబ్‌ కాంట్రాక్టర్లకు సొమ్ము ఎగొట్టిన ట్రాన్స్‌ స్ట్రాయ్...

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ స్ట్రాయ్‌ కంపెనీ పనులు చేయించుకుని సబ్‌ కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొట్టింది. పోలవరం నిర్మాణ పనుల్లో ఈ వ్యవహారం సాగింది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్దకు వచ్చిన ట్రాన్స్‌ స్ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావును బాధితులు ఘొరావ్ చేశారు. ట్రాన్స్‌ స్ట్రాయ్ డబ్బులు ఎగ్గొట్టిన వారిలో చిన్నచిన్న సబ్‌ కాంట్రాక్టర్లతో పాటు మిషనరీ సరఫరా చేసిన వారు, ఉద్యోగులు కూడా ఉన్నారు. వారంతా ట్రాన్స్‌ స్ట్రాయ్ ఈడీ […]

సబ్‌ కాంట్రాక్టర్లకు సొమ్ము ఎగొట్టిన ట్రాన్స్‌ స్ట్రాయ్...
X

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ స్ట్రాయ్‌ కంపెనీ పనులు చేయించుకుని సబ్‌ కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొట్టింది. పోలవరం నిర్మాణ పనుల్లో ఈ వ్యవహారం సాగింది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్దకు వచ్చిన ట్రాన్స్‌ స్ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావును బాధితులు ఘొరావ్ చేశారు.

ట్రాన్స్‌ స్ట్రాయ్ డబ్బులు ఎగ్గొట్టిన వారిలో చిన్నచిన్న సబ్‌ కాంట్రాక్టర్లతో పాటు మిషనరీ సరఫరా చేసిన వారు, ఉద్యోగులు కూడా ఉన్నారు. వారంతా ట్రాన్స్‌ స్ట్రాయ్ ఈడీ సాంబశివరావును గట్టిగా నిలదీశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని సచివాలయం నుంచి బయటకు పంపించారు. చిన్నచిన్న సబ్‌ కాంట్రాక్టర్లకు 23 కోట్ల రూపాయలు కంపెనీ చెల్లించాల్సి ఉంది.

బాధితులు హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళ్లగా అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో గెంటివేయించారు రాయపాటి. 73 మందికి డబ్బులు బకాయి ఉన్న మాట వాస్తవమేనని… కంపెనీ ఇబ్బందుల్లో ఉండడం వల్లే చెల్లించలేకపోయామని ఈడీ తెలిపారు. పరిస్థితి చక్కబడగానే ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్‌ కూడా చెల్లిస్తామన్నారు.

First Published:  13 Sept 2019 12:58 PM IST
Next Story