Telugu Global
NEWS

ప్రో-కబడ్డీలీగ్ లో అరుదైన రికార్డు

వెయ్యి రైడింగ్ పాయింట్ల ప్రదీప్ నర్వాల్  ఆరు సీజన్లలోనే వెయ్యి పాయింట్ల మొనగాడు ప్రో-కబడ్డీలీగ్ ట్రిపుల్ విన్నర్ పట్నా పైరేట్స్ సూపర్ రైడర్ ప్రదీప్ నర్వాల్..ప్రస్తుత ఏడో సీజన్లో ఓ అరుదైన, అసాధారణ రికార్డు సాధించాడు. రైడింగ్ లో వెయ్యి పాయింట్ల మైలు రాయి చేరిన తొలి ప్రో కబడ్డీ ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. కేవలం తన రైడింగ్ ప్రతిభతోనే పట్నా పైరేట్స్ జట్టును మూడుసార్లు ప్రో-కబడ్డీ విజేతగా నిలిపిన ప్రదీప్ నర్వాల్..ప్రో-కబడ్డీ 5వ సీజన్లో విశ్వరూపమే […]

ప్రో-కబడ్డీలీగ్ లో అరుదైన రికార్డు
X
  • వెయ్యి రైడింగ్ పాయింట్ల ప్రదీప్ నర్వాల్
  • ఆరు సీజన్లలోనే వెయ్యి పాయింట్ల మొనగాడు

ప్రో-కబడ్డీలీగ్ ట్రిపుల్ విన్నర్ పట్నా పైరేట్స్ సూపర్ రైడర్ ప్రదీప్ నర్వాల్..ప్రస్తుత ఏడో సీజన్లో ఓ అరుదైన, అసాధారణ రికార్డు సాధించాడు.

రైడింగ్ లో వెయ్యి పాయింట్ల మైలు రాయి చేరిన తొలి ప్రో కబడ్డీ ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. కేవలం తన రైడింగ్ ప్రతిభతోనే పట్నా పైరేట్స్ జట్టును మూడుసార్లు ప్రో-కబడ్డీ విజేతగా నిలిపిన ప్రదీప్ నర్వాల్..ప్రో-కబడ్డీ 5వ సీజన్లో విశ్వరూపమే ప్రదర్శించాడు.

ఆ సీజన్లో ఏకంగా 369 రైడింగ్ పాయింట్లు సాధించడం ద్వారా అత్యుత్తమ ప్లేయర్ గా నిలిచాడు. ఓ రైడ్ లో 8 పాయింట్లు సాధించిన ఘనత సైతం ప్రదీప్ కే దక్కుతుంది.

కోల్ కతా వేదికగా జరిగిన 7వ సీజన్ లీగ్ మ్యాచ్ లో…తమిళ్ తలైవాస్ తో ముగిసిన మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ 1000 రైడింగ్ పాయింట్ల మైలురాయిని చేరగలిగాడు.

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పట్నా పైరేట్స్ కు 51-25 పాయింట్ల భారీవిజయం అందించాడు. ప్రదీప్ నర్వాల్ ఒక్కడే 26 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 12 మ్యాచ్ ల్లో పట్నా పైరేట్స్ కు ఇది నాలుగో గెలుపు మాత్రమే.

లీగ్ లో మిగిలిన 8 మ్యాచ్ ల్లో విజయాలు సాధించగలిగితేనే పట్నా పైరేట్స్ ప్లేఆఫ్ రౌండ్ చేరే అవకాశాలున్నాయి.

First Published:  12 Sept 2019 10:41 PM GMT
Next Story