Telugu Global
International

దేశంలో బోల్తా కొడుతున్న ఫారిన్ ఎంబీబీఎస్‌

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసి వస్తున్న వారు స్వదేశంలో నిలబడలేకపోతున్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్ సీటు సాధించడంలో విఫలమై విదేశాల్లో ఫీజు కట్టి సులవుగానే ఎంబీబీఎస్‌ చదివి వస్తున్నా… దేశంలో ప్రాక్టిస్ చేసేందుకు లైసెన్స్ మాత్రం సాధించలేకపోతున్నారు. ఇండియాలో ప్రాక్టీస్ చేసేందుకు ఇచ్చే లైసెన్స్‌ కోసం నిర్వహించే పరీక్షలో 85 శాతం మంది ఫెయిల్ అవుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2015-18 మధ్య నిర్వహించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌ పరీక్షకు 61వేల 500 మంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ […]

దేశంలో బోల్తా కొడుతున్న ఫారిన్ ఎంబీబీఎస్‌
X

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేసి వస్తున్న వారు స్వదేశంలో నిలబడలేకపోతున్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్ సీటు సాధించడంలో విఫలమై విదేశాల్లో ఫీజు కట్టి సులవుగానే ఎంబీబీఎస్‌ చదివి వస్తున్నా… దేశంలో ప్రాక్టిస్ చేసేందుకు లైసెన్స్ మాత్రం సాధించలేకపోతున్నారు.

ఇండియాలో ప్రాక్టీస్ చేసేందుకు ఇచ్చే లైసెన్స్‌ కోసం నిర్వహించే పరీక్షలో 85 శాతం మంది ఫెయిల్ అవుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2015-18 మధ్య నిర్వహించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌ పరీక్షకు 61వేల 500 మంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్ధులు హాజరయ్యారు. కానీ వారిలో కేవలం 8వేల 700 మంది మాత్రమే పరీక్షలో గట్టెక్కారు.

అఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, హంగరీ, థాయ్‌లాండ్‌, జాంబియా దేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారిలో దాదాపు అందరూ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌ లో విఫలమయ్యారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎఫ్‌ఎంజీఈని క్లియర్ చేస్తున్న వారి శాతం దారుణంగా పడిపోతున్నట్టు నివేదికలను బట్టి తెలుస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత శాతం 2012–13లో 28.29 ఉండగా అది 2016–17 నాటికి 9.44 కనిష్టానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.

First Published:  13 Sept 2019 5:10 AM IST
Next Story