Telugu Global
NEWS

రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక కమిటీని ప్రకటించింది. ఏపీలో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమంగా పంచాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్‌రావు వ్యవహరించనున్నారు. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలిమోహన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ. కేటీ రవీంద్రన్‌, డా. కేవీ అరుణాచలం ఉంటారు. ఆరు వారాల్లోగా ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఏం […]

రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటు
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక కమిటీని ప్రకటించింది. ఏపీలో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమంగా పంచాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్‌రావు వ్యవహరించనున్నారు.

సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలిమోహన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ. కేటీ రవీంద్రన్‌, డా. కేవీ అరుణాచలం ఉంటారు. ఆరు వారాల్లోగా ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలన్న దానిపై పరిశీలన చేసి నివేదిక ఇస్తుంది. రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని కమిటీ పరిశీలన చేస్తుంది.

First Published:  13 Sept 2019 2:04 PM IST
Next Story