Telugu Global
Cinema & Entertainment

అటు రొమాన్స్... ఇటు యాక్షన్.... పాయల్ 'ఆర్ డి ఎక్స్ లవ్'

ఇప్పటికే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి అందరినీ షాక్ కు గురి చేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తాజాగా మళ్లీ అలాంటి ఒక బోల్డ్ పాత్ర తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ‘ఆర్ డి ఎక్స్ లవ్’ అనే ఆసక్తి కరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ భాను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వి కె నరేష్, నాగినీడు, తేజస్ కంచర్ల, […]

అటు రొమాన్స్... ఇటు యాక్షన్....  పాయల్ ఆర్ డి ఎక్స్ లవ్
X

ఇప్పటికే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి అందరినీ షాక్ కు గురి చేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తాజాగా మళ్లీ అలాంటి ఒక బోల్డ్ పాత్ర తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

‘ఆర్ డి ఎక్స్ లవ్’ అనే ఆసక్తి కరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ భాను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వి కె నరేష్, నాగినీడు, తేజస్ కంచర్ల, ఆదిత్యమీనన్, ఆమని, తులసి, ముమైత్ ఖాన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు

టీజర్ తోనే ఆకట్టుకున్న చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో కేవలం రొమాంటిక్ సన్నివేషాల్లోనే కాకుండా నటనతో నూ పాయల్ ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సినిమాలో పాయల్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించడం విశేషం.

సికే సినిమాస్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, రాధన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మోషన్ పోస్టర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  11 Sept 2019 9:28 AM IST
Next Story