Telugu Global
NEWS

ప్రో-కబడ్డీలీగ్ ఫైనల్స్ కు వేదికగా అహ్మదాబాద్

అక్టోబర్ 19న టైటిల్ ఫైట్ అక్టోబర్ 14 నుంచి ప్లేఆఫ్ సమరం ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ పోటీలు దేశంలోని వివిధ నగరాలలో జీడిపాకం సిరీయల్ లా సాగుతూ వస్తున్నాయి. లీగ్ ఆఖరి దశ పోటీలతో పాటు… ఫైనల్స్ కు వేదికగా అహ్మదాబాద్ ను నిర్ణయించినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. మొత్తం 12 జట్లతో గత ఎనిమిదివారాలుగా నిర్వహిస్తూవస్తున్న లీగ్ లో దబాంగ్ ఢిల్లీ 59 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బెంగాల్ వారియర్స్ రెండోస్థానంలో కొనసాగుతోంది. టాప్-6 జట్ల మధ్య ప్లేఆఫ్ […]

ప్రో-కబడ్డీలీగ్ ఫైనల్స్ కు వేదికగా అహ్మదాబాద్
X
  • అక్టోబర్ 19న టైటిల్ ఫైట్
  • అక్టోబర్ 14 నుంచి ప్లేఆఫ్ సమరం

ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ పోటీలు దేశంలోని వివిధ నగరాలలో జీడిపాకం సిరీయల్ లా సాగుతూ వస్తున్నాయి. లీగ్ ఆఖరి దశ పోటీలతో పాటు… ఫైనల్స్ కు వేదికగా అహ్మదాబాద్ ను నిర్ణయించినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

మొత్తం 12 జట్లతో గత ఎనిమిదివారాలుగా నిర్వహిస్తూవస్తున్న లీగ్ లో దబాంగ్ ఢిల్లీ 59 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బెంగాల్ వారియర్స్ రెండోస్థానంలో కొనసాగుతోంది.

టాప్-6 జట్ల మధ్య ప్లేఆఫ్ సమరం

మొత్తం 12జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఆరుస్థానాలలో నిలిచిన జట్ల మధ్య జరిగే ప్లేఆఫ్ సమరం అక్టోబర్ 14 నుంచి అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 14 జరిగే ఎలిమినేటర్ -1 పోటీలో లీగ్ లో 3వ స్థానం సాధించిన జట్టుతో 6వ స్థానంలో నిలిచినజట్టు తలపడుతుంది. అదేరోజున జరిగే ఎలిమినేటర్-2 రౌండ్లో లీగ్ 4వ ర్యాంక్ జట్టుతో 5వ ర్యాంక్ జట్టు పోటీపడుతుంది.

అక్టోబర్ 16న సెమీఫైనల్స్…

అక్టోబర్ 16న జరిగే తొలిసెమీఫైనల్లో లీగ్ టాప్ ర్యాంకర్ జట్టుతో…ఎలిమినేటర్-1 విజేత జట్టు తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో లీగ్ టేబుల్ రెండో ర్యాంక్ జట్టుతో ఎలిమినేటర్-2 విన్నర్ జట్టు ఢీ కొంటుంది.

అక్టోబర్ 19న టైటిల్ ఫైట్..

సెమీఫైనల్స్ లో విజయాలు సాధించిన రెండుజట్ల మధ్య అక్టోబర్ 19న టైటిల్ ఫైట్ నిర్వహిస్తారు. ఈ పోటీతో లీగ్ 7వ సీజన్ కు తెరపడనుంది.

ప్రో-కబడ్డీ లీగ్ గత ఆరుసీజన్లలో అత్యధిక టైటిల్స్ సాధించినజట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు, జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, బెంగళూరు బుల్స్ జట్లు ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.

First Published:  11 Sept 2019 2:08 AM IST
Next Story