Telugu Global
NEWS

సిద్ధాంతి సూచనతోనే చంద్రబాబు "ఛలో ఆత్మకూరు"

స్వార్థ రాజకీయం కోసం పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆత్మకూరు గ్రామం గురించి చంద్రబాబు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక కాలనీలోని బంధువుల మధ్య ఉన్న కుటుంబ తగాదాలను పట్టుకుని దాన్ని మొత్తం పల్నాడు ప్రాంతానికి ఆపాదించేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వివాదం ఉన్న కాలనీలో మొత్తం 50 కుటుంబాలు ఉంటే… చంద్రబాబు మాత్రం తన శిబిరంలో 127 కుటుంబాలు ఉన్నాయంటూ పచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. […]

సిద్ధాంతి సూచనతోనే చంద్రబాబు ఛలో ఆత్మకూరు
X

స్వార్థ రాజకీయం కోసం పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆత్మకూరు గ్రామం గురించి చంద్రబాబు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక కాలనీలోని బంధువుల మధ్య ఉన్న కుటుంబ తగాదాలను పట్టుకుని దాన్ని మొత్తం పల్నాడు ప్రాంతానికి ఆపాదించేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

వివాదం ఉన్న కాలనీలో మొత్తం 50 కుటుంబాలు ఉంటే… చంద్రబాబు మాత్రం తన శిబిరంలో 127 కుటుంబాలు ఉన్నాయంటూ పచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు వద్ద ఉండే ఒక సిద్ధాంతి ఇచ్చిన సలహా మేరకే చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌… ఆత్మకూరులో పర్యటించి తిరిగి సీఎం అయ్యారని.. కాబట్టి చంద్రబాబు కూడా ఆత్మకూరులో పర్యటిస్తే తిరిగి సీఎం అవుతారని ఆయనకు ఆ సిద్ధాంతి సలహా ఇచ్చారని… అందుకే ఈ రాద్దాంతం చేస్తున్నారని పిన్నెల్లి చెప్పారు.

చంద్రబాబుకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా పల్నాడు ప్రాంతంపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా పల్నాడు ప్రాంతంలో అశాంతి ఉండేదన్నారు.

చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు 2001 మార్చి 10న ఒకే రోజు 7మంది కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేశారన్నారు. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో మాచర్ల ప్రాంతంలో ఏడుగురు వైసీపీ వాళ్లను హత్య చేశారన్నారు.

కుటుంబాల మధ్య తగాదాను తెచ్చి గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పిన్నెల్లి మండిపడ్డారు.

First Published:  11 Sept 2019 4:53 AM IST
Next Story