మళ్లీ బజారుకెక్కిన 'మా' అసోసియేషన్...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్- ‘మా’ మరోసారి బజారుకెక్కింది. అసోసియేషన్‌లో తీవ్ర విభేదాలు వచ్చాయి. అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య గొడవ ముదిరింది. నరేష్‌కు ఉపాధ్యక్షుడు రాజశేఖర్ షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కమిటీ సభ్యులు కూడా నోటీసులపై సంతకాలు చేశారు. ఇటీవల నరేష్ మా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దాంతో ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌కు మా బాధ్యతలు అప్పగించాలని నిన్నటి కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం చెల్లదని నరేష్ వర్గం చెబుతోంది. కొత్త కమిటీ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్- ‘మా’ మరోసారి బజారుకెక్కింది. అసోసియేషన్‌లో తీవ్ర విభేదాలు వచ్చాయి. అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య గొడవ ముదిరింది. నరేష్‌కు ఉపాధ్యక్షుడు రాజశేఖర్ షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
కమిటీ సభ్యులు కూడా నోటీసులపై సంతకాలు చేశారు. ఇటీవల నరేష్ మా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దాంతో ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌కు మా బాధ్యతలు అప్పగించాలని నిన్నటి కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం చెల్లదని నరేష్ వర్గం చెబుతోంది.
కొత్త కమిటీ వచ్చి ఆరునెలలు అయినా కొత్తగా ఫండ్ సేకరణకు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడంపైనా కమిటీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు కమిటీ భేటీకి ఆహ్వానించినా అధ్యక్షుడు నరేష్ రావడం లేదు. తాను బిజీగా ఉన్నానంటూ ఆయన చెబుతూ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఈనేపథ్యంలోనే మంగళ వారం రాత్రి కమిటీ సమావేశం జరిగింది.
నరేష్‌ను పక్కనపెట్టి కమిటీ ముందుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశానికి ఎందుకు రావడం లేదన్న దానిపై షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత నరేష్‌ను మా బాధ్యతలను నుంచి తప్పించాలని రాజశేఖర్ నేతృత్వంలోకి కమిటీ నిర్ణయించింది.