Telugu Global
NEWS

నీళ్ళు రావడంతో పల్నాడులో వరి వేస్తున్నారు... అందుకే చంద్రబాబు వర్రీ అవుతున్నాడు...

ప్రాజెక్టుల్లోకి నీరు రావడంతో పల్నాడు ప్రాంతంలో రైతులు వరి వేసుకుంటున్నారని… ఇలా ప్రజలు ప్రశాంతంగా ఉండడం చూసి ఓర్వలేక ఐదేళ్లలో నీరు కూడా ఇవ్వలేకపోయిన దద్దమ్మలు పల్నాడులో శాంతిభద్రతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాసుమహేష్ విమర్శించారు. జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పల్నాడు ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్, ఇంటింటికి మంచినీరు, లిఫ్ట్ ఇరిగేషన్‌ కోసం రెండు వేల కోట్లు కేటాయించారన్నారు. గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీలుగా చేశారన్నారు. ఇసుక, మట్టి, మైనింగ్, పేకాట […]

నీళ్ళు రావడంతో పల్నాడులో వరి వేస్తున్నారు... అందుకే చంద్రబాబు వర్రీ అవుతున్నాడు...
X

ప్రాజెక్టుల్లోకి నీరు రావడంతో పల్నాడు ప్రాంతంలో రైతులు వరి వేసుకుంటున్నారని… ఇలా ప్రజలు ప్రశాంతంగా ఉండడం చూసి ఓర్వలేక ఐదేళ్లలో నీరు కూడా ఇవ్వలేకపోయిన దద్దమ్మలు పల్నాడులో శాంతిభద్రతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాసుమహేష్ విమర్శించారు.

జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పల్నాడు ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్, ఇంటింటికి మంచినీరు, లిఫ్ట్ ఇరిగేషన్‌ కోసం రెండు వేల కోట్లు కేటాయించారన్నారు. గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీలుగా చేశారన్నారు.

ఇసుక, మట్టి, మైనింగ్, పేకాట క్లబ్బులు, సెక్స్ రాకెట్లు, గంజాయి ఇలా ఐదేళ్లలో టీడీపీ నేతలు చేయని తప్పుడు పని అంటూ ఏమైనా ఉందా అని కాసు ప్రశ్నించారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్‌ కూడా వదిలేలా లేరు అన్నట్లు… చివరకు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫినాయిల్‌ కూడా టీడీపీ వాళ్ళు దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

పల్నాడులో పర్యటిస్తానంటున్న చంద్రబాబు… రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలను, ఇప్పటి ఎమ్మెల్యేలను తీసుకొస్తూ.. మరి ఇదే ప్రాంతానికి చెందిన కోడెల, యరపతినేని ఎందుకు వెంట తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్, యరపతినేనిని తీసుకొస్తే ప్రజలు ముఖం మీద ఉమ్మేస్తారని భయమా అని కాసు ప్రశ్నించారు.

First Published:  11 Sept 2019 6:35 AM IST
Next Story