Telugu Global
NEWS

పోరాటం రాజధాని కోసమా? రాజధానిలో తన భూముల కోసమా?

పార్టీ మారినా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిలో ఇంకా ఆ టీడీపీ వాసనలు పోవడం లేదు. తాజాగా ఆయన చంద్రబాబుకు కాపు కాసే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. రాజధాని అమరావతి మార్పు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు ఎంపీ సుజనా ఆధ్వర్యంలో ఏపీ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ఏపీలో అధికారంలో ఉన్న రోజుల్లో సుజనాచౌదరి ఓ వెలుగు వెలిగారు. బీజేపీతో దోస్తీలో టీడీపీ తరుఫున కేంద్రమంత్రిగా కూడా చేశారు. చంద్రబాబుకు ఆర్థిక […]

పోరాటం రాజధాని కోసమా? రాజధానిలో తన భూముల కోసమా?
X

పార్టీ మారినా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిలో ఇంకా ఆ టీడీపీ వాసనలు పోవడం లేదు. తాజాగా ఆయన చంద్రబాబుకు కాపు కాసే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. రాజధాని అమరావతి మార్పు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు ఎంపీ సుజనా ఆధ్వర్యంలో ఏపీ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీడీపీ ఏపీలో అధికారంలో ఉన్న రోజుల్లో సుజనాచౌదరి ఓ వెలుగు వెలిగారు. బీజేపీతో దోస్తీలో టీడీపీ తరుఫున కేంద్రమంత్రిగా కూడా చేశారు. చంద్రబాబుకు ఆర్థిక అండదండలు అందించిన ముఖ్యుల్లో సుజన ఒకరిని టాక్. అలాంటి సుజనా చంద్రబాబు ఏపీలో ఓడిపోగానే ఫ్లేట్ ఫిరాయించాడు. బీజేపీలో చేరాడు. ఇప్పుడు టీడీపీ అన్న, చంద్రబాబు అన్న బీజేపీలోని పెద్దలకు పడడం లేదు.

ఇలాంటి సమయంలో బీజేపీలోకి మారినా కూడా టీడీపీ అనుకూల వైఖరిని సుజన ప్రదర్శిస్తుండడం బీజేపీ శ్రేణులను కూడా నివ్వెరపరుస్తోంది.

తాజాగా ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ ను బుధవారం సుజనా చౌదరి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం కలవడం.. రాజధానిని మార్చవద్దని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి రాజధాని రైతులను కూడా తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం విశేషం.

ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు, ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ల బినామీలకు ప్రాజెక్టులు, భూములు ఉన్నట్టు సమాచారం. అందుకే పార్టీ మారినా కానీ చంద్రబాబుకు సపోర్టుగా సుజనాచౌదరి రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

First Published:  11 Sept 2019 5:45 AM GMT
Next Story