Telugu Global
NEWS

బయోమెట్రిక్ ఉన్నది అందుకే....

“బయోమెట్రిక్, ఆధార్, ఐరిష్ వంటివి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి తప్ప… వారికి పథకాలు నిలిపివేయడానికి కాదు. ఈ విషయాన్నిఅధికారులు, ప్రజా ప్రతినిధులు తెలుసుకోవాలి” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…. మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. […]

బయోమెట్రిక్ ఉన్నది అందుకే....
X

“బయోమెట్రిక్, ఆధార్, ఐరిష్ వంటివి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి తప్ప… వారికి పథకాలు నిలిపివేయడానికి కాదు. ఈ విషయాన్నిఅధికారులు, ప్రజా ప్రతినిధులు తెలుసుకోవాలి” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.

తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…. మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ పథకాలను లబ్ధిదారులకు ఏ రూపంలో ఇచ్చారు అన్నది ప్రధానం కాదని, ఆ పథకాలు వారికి చేరుతున్నాయా లేదా అన్నది ముఖ్యం అని అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

“బయోమెట్రిక్ లో సరిగా లేదని, ఆధార్ తో అనుసంధానం కాలేదని, ఐరిష్ సరిపోలేదని వంకలు పెట్టకండి. ఈ మూడూ ఉన్నవి పథకాలు లబ్ధిదారులకు చేరాయో లేదో తెలుసుకునేందుకే తప్ప వాటిని నిలిపి వేసేందుకు కాదు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సచివాలయలకు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని… పిల్లలందరూ విధిగా పాఠశాలలకు వెళ్లేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. వివిధ సందర్భాలలో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన తక్షణ పరిహారాన్ని వెంటనే చెల్లించాలని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

“ఈ నిధుల కోసం తక్షణమే 7.48 కోట్ల రూపాయలు విడుదల చేయండి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిధులను కూడా నిలిపివేసి బాధిత మహిళల ఉసురు పోసుకుంది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బాధిత మహిళలకు తక్షణ సాయం అందించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద కోటి రూపాయలకు పైగా నిధులు ఉండాలని, మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు ఎన్ని నిధులు అయినా వెచ్చించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో అంగన్ వాడీల పరిపుష్టి కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నిధులు ఇస్తే ఆ అంగన్ వాడీలకు ఆ దాతల పేర్లు పెట్టాలని, దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.

First Published:  10 Sept 2019 5:12 AM IST
Next Story