తెలంగాణ కేబినెట్‌లో ఎవరు ఇన్ ? ఎవరు అవుట్ ?
తెలంగాణ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైంది. దీంతో ఇప్పుడు ఎవరు కేబినెట్‌లో ఉంటారు? ఎవరు పోతారు? అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇందులో ప్రధానమైన పేరు మాజీ మంత్రిహరీష్‌రావు…. కేబినెట్‌లోకి తీసుకుంటారా? లేదా? అయితే ప్రగతిభవన్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు హరీష్‌రావుకు కేబినెట్‌లో చోటు లభిస్తోంది. ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు కేసీఆర్ మనసు మారితే చెప్పలేం. హరీష్‌రావును ఇప్పుడు పక్కనపెట్టి….. గోడ మీద పిల్లిలా ఎదురుచూస్తున్న బీజేపీకి […]
తెలంగాణ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైంది. దీంతో ఇప్పుడు ఎవరు కేబినెట్‌లో ఉంటారు? ఎవరు పోతారు? అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇందులో ప్రధానమైన పేరు మాజీ మంత్రిహరీష్‌రావు…. కేబినెట్‌లోకి తీసుకుంటారా? లేదా? అయితే ప్రగతిభవన్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు హరీష్‌రావుకు కేబినెట్‌లో చోటు లభిస్తోంది. ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు కేసీఆర్ మనసు మారితే చెప్పలేం.
హరీష్‌రావును ఇప్పుడు పక్కనపెట్టి….. గోడ మీద పిల్లిలా ఎదురుచూస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వొద్దనేది కేసీఆర్ ఎత్తుగడ. ఈ సమయంలో పక్కనపెడితే పార్టీలో చీలికకు చాన్స్ ఇచ్చినట్లే. హరీష్ ను పక్కనపెడితే కేడర్ లో విభజన రావడం ఖాయం. దీంతో ఈ విస్తరణలో హరీష్‌రావును పక్కనపెట్టే చాన్స్ లేదంటున్నారు. మరోవైపు ఈటలను కూడా తప్పించే అవకాశం లేదనేది తెలుస్తోంది.
మరోవైపు ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్, మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు విన్పిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆలూరు రమేష్‌కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కేబినెట్‌లో మున్నూరు కాపుకు చోటు లేదు. గత కేబినెట్‌లో జోగురామన్న ఉండేవారు. అయితే ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ ఎంపీలు మున్నూరు కాపు వారే గెలిచారు. దీంతో ఆ వర్గానికి చోటు ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.
మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ సబితాఇంద్రారెడ్డి కి స్థానం ఇస్తే మల్లారెడ్డికి ఉద్వాసన చెబుతారని అంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రిని పక్కనపెడతారని టాక్ విన్పిస్తోంది. అయితే రెడ్డి కోటాలో ఇప్పటికే ఐదుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కొత్తగా రెడ్డి సామాజిక వర్గానికి చాన్స్ ఇస్తే ఇప్పటికే ఉన్న మంత్రులను పక్కనపెట్టాల్సి వస్తుంది.
ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ ను చీప్ విప్‌గా నియమిస్తే….గొంగిడి సునీత,
గంపా గోవర్దన్,గువ్వల బాలరాజు,అరెకపూడి గాంధీ,రేగా కాంతారావు, బాల్క సుమన్ లను విప్‌లుగా నియమించారు.
మరోవైపు మాజీమంత్రులకు కేబినెట్‌లో చోటు ఇవ్వలేమని తేల్చిచెప్పారట. కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, తుమ్మల నాగేశ్వరరావులకు ఉన్నత పదవులు ఇస్తారని చెబుతున్నారు. దీంతో వీరికి కూడా మంత్రి అయ్యే చాన్స్ లేకుండా పోయింది.